దసరా పండుగకు సొంతూరు వెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. లేదంటే తిరిగి వచ్చాక కంగుతినే పరిస్థితి ఎదురు కావచ్చు. తాళాలు వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతంలో పండుగలకు తాళాలు వేసి సొంతూరికి వెళ్లిన వారి ఇళ్లలో దొంగలు.. మొత్తం దోచుకుపోయిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. తరచూ పండుగల సమయంలో ఊరెళ్లి తిరిగి వచ్చాక దొంగతనం ఫిర్యాదులు అధికంగా అందుతుంటాయి. ఇటీవల కూడా చెడ్డీ గ్యాంగ్ లాంటి ముఠాల ఉనికి హైదరాబాద్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ముందు జాగ్రత్తగా పోలీసులు కొన్ని సూచనలిచ్చారు.


Also Read: Hyderabad Theft: ఇంట్లో చోరీ.. వృద్ధురాలి తెలివితో వెంటనే పట్టుబడ్డ దొంగ, ఆ టెక్నిక్ ఏంటంటే..


దసరా పండుగ సందర్భంగా సొంతూరికి వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కీలక సూచనలు చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దసరా పండుగకు ఊరికి వెళ్లే వారు తస్మాత్ జాగ్రత్త అని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. తాళం పెట్టి గ్రామాలకు వెళ్తున్నవారు చుట్టుపక్కల వారికి మాత్రమే కాక, స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలని అన్నారు. 


Also Read: Hyderabad: తల పగలగొట్టుకొని, గాజు పెంకులు నమిలి, బ్లేడుతో కోసుకొని వ్యక్తి నానా బీభత్సం..


హైదరాబాద్‌లో ఇతర రాష్టాలకు చెందిన ముఠాలు ఎక్కువగా దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇంట్లో విలువైన వస్తువులు ఎవరూ ఉంచకుండా జాగ్రత్త పడాలని సూచించారు. బంగారం, డబ్బులు, ఇతర విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకుండా బ్యాంకు లాకర్లలో ఉంచుకోవాలని సూచించారు. ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నవారు అవి పని చేస్తున్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించినా, ఎలాంటి అనుమానాలు వచ్చినా స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మహేష్ భగవత్ సూచించారు.


Also Read: TSRTC: ఆర్టీసీ బస్సులకి కూడా ‘అయ్యయ్యో వద్దమ్మా..’ ఈ టైంలో సజ్జనార్ ప్లాన్ మామూలుగా లేదుగా..!


4 వేల స్పెషల్ బస్సులు


మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా దసరా సందర్భంగా టీఎస్ ఆర్టీసీ 4 వేల వరకూ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే, ప్రయాణికులను ఆకర్షించేందుకు ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదని గతంలోనే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సర్వీసులు.. ప్రైవేటు బస్సులతో పోలిస్తే ఎంతో భద్రతగా ఉంటాయనే అర్థం వచ్చేలా లఘు చిత్రాలను సైతం రూపొందించి ప్రచారం చేస్తున్నారు. 


Also Read: టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఫిక్స్, తేదీ ఎప్పుడంటే.. కేటీఆర్ ప్రకటన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి