సాధారణంగా ఇళ్లకు తాళాలు వేసి ఊరికి వెళ్లినప్పుడు దొంగలు పడి అంతా దోచుకుపోయే ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో బాధితులు సొమ్మంతా పోయిందని టెన్షన్ పడిపోయి తప్పులు చేసేస్తుంటారు. ఇంట్లో ఏమేం పోయాయో చూసుకొని, చెల్లాచెదురుగా పడ్డ వస్తువులను సర్దుకొని అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల విచారణ చేసేందుకు పోలీసులకు కాస్త ఇబ్బంది. కానీ, తాజాగా హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌లో ఓ పెద్దావిడ ఇంట్లో జరిగిన దొంగతనం ఘటనలో ఆమె తెలివిగా వ్యవహరించడంతో నిందితుడు త్వరగా పట్టుబడ్డాడు.
తన ఇంట్లో దొంగతనం జరిగిన వెంటనే ఆ వృద్ధురాలు చేసిన పని పోలీసులను కూడా ప్రశంసించేలా చేసింది. దొంగను పట్టించడంలో ఆమె ఎంతో తెలివిగా వ్యవహరించిందని పోలీసులు తెలిపారు. ఇంతకీ ఆమె చేసిన పని ఏంటి..? దొంగను ఎలా పట్టించింది..? అనే వివరాలివీ..
Also Read : ‘మా’ పదవులకు ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా .. ఇప్పటికిప్పుడు కొత్త సంఘం లేనట్లే !
కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌లో ఓ వృద్ధురాలు తన ఇంటికి తాళం వేసి నిజాంపేటలోని తన కుమార్తె ఇంటికి వెళ్లింది. మూడు రోజుల తర్వాత వచ్చి చూసేసరికి ఇల్లు గుల్ల అయింది. ఇంట్లో దొంగలు పడ్డట్లు గమనించింది. కంగుతిన్న ఆమె కంగారు పడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ గదిలోని ఏ వస్తువులనూ ముట్టుకోలేదు. ఆవిడ చేసిన ఆ పనే ఆధారాలు సేకరించేందుకు వచ్చిన క్లూస్ టీంకు బాగా ఉపయోగపడింది. ఘటన జరిగిన స్థలంలో వస్తువులపై వేలిముద్రలు సేకరించిన పోలీసులు.. పాత నేరస్థుల రికార్డులోని వేలి ముద్రలతో పోల్చారు. అవి సరిపోలడంతో దొంగ దొరికిపోయాడు.
నిందితుడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన పసుపులేటి దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి చెందినవిగా నిర్ధారించారు. అతని వివరాల ఆధారంగా గుర్తించి కృష్ణా జిల్లాలో ఉన్నట్లు తేల్చి అరెస్టు చేశారు. ఇతను 2018లో బంజారాహిల్స్ పరిధిలో బైక్ దొంగతనం కేసులో, ఇతర పాత కేసుల్లో నిందితుడు కావడంతో ఇతనిపై పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. 2019 సెప్టెంబర్‌లో జైలు నుంచి బయటికి వచ్చినా.. బుద్ధి మార్చుకోని దుర్గాప్రసాద్.. కేపీహెచ్‌బీ, జూబ్లీహిల్స్, మాదాపూర్, సూర్యాపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. కొట్టేసిన ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
Also Read : ‘మా’ ఎన్నికల్లో ట్రాజెడీ సీన్లు.. బెనర్జీ కన్నీరు.. తనీష్ ఆవేదన!
Also Read: రెండు వర్గాలుగా ఇక టాలీవుడ్ ! "మంచు"కు మందుంది అసలు పరీక్ష !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి