మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులంతా రాజీనామా చేశారు. సంస్థ ముందుకు వెళ్లాంటే అందరి ఆలోచనలు ఒకేలా ఉండాలన్నారు. అలాంటి పరిస్థితి లేదని .. అందుకే తాము రాజీనామా చేస్తున్నామన్నారు. మంచు విష్ణు తనకు ఇష్టం వచ్చిన వారిని తాము రాజీనామా చేసిన స్థానాల్లో నియమించుకుని పరిపాలన చేయాలన్నారు. ఎన్నికల హామీలుగా పెద్ద పెద్ద మాటలు చెప్పారని వాటన్నింటినీ రెండేళ్లలో అమలు చేయాలన్నారు. అమలు చేయకపోతే మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. తమది ప్రశ్నించే నైజమని.. అలాంటి మేము టీంలో ఉంటే్ గొడవలు జరుగుతాయని అందుకే రాజీనామా చేస్తున్నామని శ్రీకాంత్ తెలిపారు. 


Also Read : 'మా'కు పోటీగా కొత్త అసోసియేషన్ రాబోతోందా..?


ఎన్నో ఆశయాలతో తాము ఎన్నికల్లో పోటీ చేశామని అయితే.. మాటలయుద్ధం జరిగిందన్నారు. ఎన్నికలు జరిగిన రోజు బెనర్జీ, తనీష్‌పై చేయి చేసుకున్నారన్నారు.  పోస్టల్ బ్యాలెట్లలోఅక్రమాలు జరిగాయని.. రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయనని గుర్తు చేశారు. కౌంటింగ్‌కు రెండు రోజులు ఎందుకు పట్టిందో తనకు అర్థం కాలేదన్నారు. "మా"కు   చేసిన రాజీనామాలు వెనక్కి తీసుకుంటామని అయితే సంస్థ బైలా మార్చబోనని హామీ ఇవ్వాలని ప్రకాష్ రాజ్ అన్నారు. 



పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలు.. మోహన్ బాబు తనపై చేసిన దౌర్జన్యం గురించి చెబుతూ..  నటుడు బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు.  తనకు మోహన్ బాబు కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందన్నారు. అయినా తనపై దాడి చేశారని కన్నీటితో చెప్పుకున్నారు. గెలిచినా తనకు సంతోషం లేదన్నారు.  జరిగిన పరిణామాలపై తనకు చాలా బాధేసిందన్నారు. అయితే చివరికి విష్ణు బాగా చేస్తాడని నమ్మకం ఉందని.. బాగా చేయాలని బెనర్జీ విష్ చేశారు. ఇతర గెలిచిన సభ్యులు కూడా కొత్త "మా" అధ్యక్షుడు, బృందానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండటానికి రాజీనామాలు చేస్తామని చెప్పారు. సంస్థ మెరుగ్గా ముందుకెళ్లడానికి తామంతా రాజీనామాలు చేస్తున్నామన్నారు. 


Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..


"మా"కు పోటీగా  ఆత్మ అంటే ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్ పేరుతో కొత్త సంఘాన్ని ప్రారంభించాలన్న ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీ పెద్దలు వారించినట్లుగా సమాచారం. వారు గెలిచినందున చెప్పిన పనులన్నీ చేసేలా ఒత్తిడి తెద్దామని.. ప్రశ్నిద్దామని ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఒక వేళ టీం ప్యానల్‌లోఉంటే చెప్పిన పనులు చేయలేక వారిపై నిందలేసి తప్పించుకుంటారని..వారి టీంలో ఉండకపోతే మంచిదని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ప్రకాష్ రాజ్ కూడా ప్రశ్నిస్తామని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మీడియా సమావేశంలో కూడా విలేకరులు ఈ అంశంపై ప్రశ్నించారు. అయితే ఆత్మ, ప్రేతాత్మ లాంటివేమీ పెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు.


Also Read : ‘మా’ చీలకుండా కాపాడుకోవాలి..! ‘పెదరాయుడి’కి మొదటి సవాల్ ఇదే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి