హైదరాబాద్‌కు చెందిన ఓ ఫార్మసీ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఫార్మా సంస్థలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఏకంగా 16 బీరువాలను ఐటీ అధికారులు తెరిచారు. అమీర్‌పేట్, సికింద్రాబాద్, శ్రీనగర్‌ కాలనీలో లాకర్లను తెరవగా.. ఒక్కొక్క అల్మారలో రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల నగదు కనిపించింది. అందులో కుక్కి ఉంచిన అల్మారాలను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఇలా మొత్తం రూ.142 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


సనత్ నగర్‌లోని కార్పోరేట్ కార్యాలయంతో పాటుగా మల్కాజ్ గిరి పరిధిలో ఉన్న సంస్థ ప్లాంట్లలోనూ సోదాలు చేశారు. గత వారం రోజులుగా అధికారులు సోదాలు చేస్తుండగా.. మొత్తం సంస్థకు చెందిన రూ.172 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్‌ చేశారు. రూ.550 కోట్ల అనుమానిత లావాదేవీలపై ఇంకా విచారణ జరుగుతోంది. కంపెనీ డబ్బులతో యాజమాన్యం భారీగా భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోపు తమ ఎదుట హాజరవ్వాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు పత్రికా ప్రకటనను సోమవారం విడుదల చేశారు. కానీ, ఏ ఫార్మా సంస్థ అన్న విషయాన్ని అందులో పేర్కొనలేదు.


Also Read: టీఆర్ఎస్‌కు ఆదాయం ఎక్కువ.. టీడీపీకి ఖర్చెక్కువ ! ప్రాంతీయ పార్టీల జమాఖర్చుల్లో చిత్రాలెన్నో !


మరోవైపు, ఈ సోదాలకు సంబంధించి ఓ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీరువాల్లో కట్టల కొద్దీ డబ్బులు ఇరికించి మరీ పెట్టారు. ఈ ఫోటోలు చూసి సామాన్యులు కంగుతింటున్నారు. నిండా నోట్ల కట్టలున్న ఇనుప బీరువాలను అధికారులు సీజ్‌ చేశారు. చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచినట్టు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో రూ.142 కోట్లు దాచారని అధికారులు వెల్లడించారు.


కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు విపరీతంగా ఎగబాకినప్పుడు కీలకంగా మారిన రెమిడెసివిర్ ఇంజక్షన్ ఈ సంస్థ నుంచే ఉత్పత్తి అయింది. అదే విధంగా బెడ్ మీద తీవ్ర అస్వస్థతకు గురైన కరోనా బాధితులకు ఇచ్చే ఒక ప్రముఖ టాబ్లెట్ సైతం ఇక్కడి నుంచే మార్కెట్ లోకి వచ్చింది. దీంతో..ఆ సమయం నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది.


Also Read: Sunday Funday: హైదరాబాద్ వాసులకు మరో గుడ్‌న్యూస్.. ఇంకోచోట కూడా సన్ డే ఫన్ డే, ఎక్కడంటే..


Watch Video : టీఆర్ఎస్ ప్రచారంలో మంత్రి హరీష్ రావు‌కి షాక్ ... ఏం జరిగిందో చూడండి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి