‘మా’ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడి గెలిచి కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ తమ పదవుల్ని తృణప్రాయంగా త్యజించేసింసి. అయితే ఈ విషయం ప్రకటించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ నటులు బెనర్జీతో పాటు ఉత్తేజ్, తనీష్ లాంటి వారు కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా బెనర్జీ అయితే కన్నీటిని ఆపుకోలేకపోయారు. బాగా ఎమోషనల్ అయ్యారు. 


Also Read : ‘మా’ పదవులకు ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా .. ఇప్పటికిప్పుడు కొత్త సంఘం లేనట్లే !


బెనర్జీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే పోలింగ్ రోజున మోహన్ బాబు ఆయనను చంపేస్తానని బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆ సందర్భంగా ఏం జరిగిందో బెనర్జీ వివరించారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు .. గొడవలు వద్దని చెప్పడానికి తాను వెళ్లానని అన్నారు. అయితే అనూహ్యంగా మోహన్ బాబు తనపై దాడికి వచ్చారని.. ఇష్టమొచ్చినట్లుగా బూతులు తిట్టారని ఆవేదన చెందారు. మోహన్ బాబు కుటంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని.. అలాంటి తనపై ఇలా వ్యవహరించడంతో  బాధ వేసిందన్నారు. ఈ సందర్భంగా బెనర్డీ కన్నీరు పెట్టుకున్నారు. 


Also Read : ‘మా’ చీలకుండా కాపాడుకోవాలి..! ‘పెదరాయుడి’కి మొదటి సవాల్ ఇదే!


తనకు నేరుగా మోహన్ బాబు ఇంటికి వెళ్లేంత చనువు ఉందని.. చిన్నప్పుడు మంచు లక్ష్మిని ఎత్తుని ఆడించానని గుర్తు చేసుకున్నారు. అయితే ఎంతటి అనుబంధం ఉన్నా ఇలా ప్రవర్తించడంతో తన మనసు విరిగిపోయిందన్నారు. ఇంత బాధలోనూ బెనర్జీ మంచు విష్ణుకు విషెష్ చెప్పారు. బాగా చేయాలని.. బాగా చేస్తాడనే నమ్మకం ఉందన్నారు. మరో యువ హీరో తనీష్ కూడా ఈ తనకు పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలను వివరించారు.  


Also Read : 'మా' లో ఇంత అలజడి మంచిదికాదు…అలా జరిగి ఉంటే బావుండేదన్న రాఘవేంద్రరావు


మోహన్ బాబు బూతులు తిట్టి కొట్టడానికి వచ్చారని.. తనను సేవ్ చేసేందుకు వచ్చినందుకే బెనర్జీపై దాడికి ప్రయత్నించారన్నారు. తనకు బాధేసిందని ఏడుస్తూంటే మంచు విష్ణు, మనోజ్ వచ్చి సముదాయించారని తనీష్ చెప్పాడు. తన వల్లే ఇదంతా జరిగిందని బెనర్జీకి సారీ చెప్పాడు తనీష్. తనకు అమ్మే సర్వస్వం అని ఆయన మాటలు మర్చిపోదామనుకున్నా అమ్మను అంటే తీసుకోలేమని..దెబ్బ మానిపోయినా ఆ గాయం గుర్తు అలాగే ఉంటుందని అన్నారు.  ఉత్తేజ్ కూడా పోలింగ్ రోజుల జరిగిన గొడవలను గుర్తు చేశారు. గత కార్యవర్గంలో ఈసీ మెంబర్‌గా ఉన్న తన భార్య చనిపోతేనే అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. 


Also Read : నా రాజీనా'మా' వెనుక లోతైన అర్థం ఉంది, త్వరలోనే చెబుతా అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి