తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. అందుకే చాలా మంది ప్రజలు తమ సమస్యలను నేరుగా కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తుంటారు. ఇలా చాలా సమస్యలు పరిష్కరించారు కూడా.
ఇప్పుడు వెరైటీగా కేటీఆర్ ట్వీట్ ఇద్దరు సెలబ్రిటీలకు సవాల్‌గా మారింది. క్రికెట్‌లో దుమ్మురేపిన గంగూలీ, సెహ్వాగ్‌కు ఈ సవాల్ ఎదురైంది.
కౌన్‌బనేగా కరోర్‌పతిలో మాజీ క్రికెటర్లు గంగూలీ, సెహ్వాగ్ ఇద్దరూ పాల్గొన్న సంగతి తెలిసింది. అక్కడ వాళ్లకు ఎదురైందీ సవాల్. 39వ ప్రశ్నగా గంగూలీ సెహ్వాగ్‌కు అమితాబచ్చన్ ఈ ప్రశ్న అడిగారు.
ALSO:ఎవరు మీలో కోటీశ్వరులు: చిరు.. నాగ్.. రికార్డులను బ్రేక్ చేసిన ఎన్టీఆర్, టీఆర్పీ అదుర్స్!
నోరు తిరగని కొవిడ్ -19 మెడిసిన్ లిస్ట్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ వీరిలో ఎవరికి ట్యాగ్ చేశారని ప్రశ్న ఇచ్చారు. ఆప్షన్స్‌లో నలుగురు పేర్లు చెప్పారు. అందులో ఒకరు కపిలి సిబల్, రెండో ఆప్షన్ సుబ్రమణ్య స్వామి, అమితవ్ ఘోష్, శశిథరూర్ పేర్లు ఇచ్చారు.
ALSO:డ్రగ్స్ కేసుల వెనుక రాజకీయం .. అన్నీ బయటపెడతానంటున్న పూనంకౌర్.. !
దీన్నే కేటీఆర్ ట్వీట్ చేశారు. సరదాగా చేసిన పని అనోకుండా కేబీసీలో రావడం ఆనందంగా ఉందని అన్నారు. కచ్చితంగా దాదా, సెహ్వాగ్ సరైన సమాధానం చెబుతారని అన్నారు.
ALSO:కళ్లజోడు జారకుండా.. దుమ్ము దులిపేస్తున్న ‘టక్ జగదీష్’ సాంగ్.. దర్శకుడు అడ్డంగా బుక్కయ్యాడు!
ఈ ఏడాది మే 20 కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. రెండు మెడిసిన్ పదాలు రాసి వీటిని సరిగ్గా పలికే వారు ఉన్నారా అనే మీనింగ్ వచ్చేలా ట్వీట్ చేశారు. ఇలాంటి పదాలు కచ్చితంగా శశిథరూర్ సమాధానం చెప్పగలని కూడా ట్వీట్ చేశారు. శశిథరూర్‌కు ట్యాగ్ చేశారు కూడా.
ALSO:ప్రకాశ్ రాజ్ ‘మా’ ప్యానెల్ ఇదే.. వాళ్లిద్దర్నీ కూడా కలిపేసుకున్నారు..
అప్పుడు ఇలా సరదాగా చేసిన ట్వీట్ ఇప్పుడు ఇలా KBCలో రావడం ఇప్పుడా ట్వీట్ వైరల్‌గా మారింది.
ALSO:రష్యాలో అజీత్ కుమార్.. బైకుపై 5 వేల కిమీలు జర్నీ, ఫొటోలు వైరల్
ALSO: పది సమస్యలు తీర్చండి... ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తులు..!
ALSO: ఇక షర్మిల పార్టీ దళిత భేరీలు ! తెలంగాణలో రాజకీయం అంతా దళితుల చుట్టే !