Jubilee Hills Minor Girl Rape Case: జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుండగా, మరోవైపు, నిందితుల డీఎన్ఏ (DNA) ను సేకరించడానికి నాంపల్లి కోర్టు (Nampalli Court) అనుమతి ఇచ్చింది. దీంతో నిందితుల నుంచి నమూనాలు సేకరించి పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు. అత్యాచారం జరిగిన వాహనంలో ఇప్పటికే ఆధారాలను క్లూస్ టీం పరిశీలించింది. ఇకపై సేకరించబోయే డీఎన్ఏ నివేదికను కూడా వాహనంలో దొరికిన ఆధారాలతో సరిపోల్చనున్నారు. మైనర్లు ఘటన సమయంలో వాహనంలోనే ఉన్నారా లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడంలో ఈ డీఎన్ఏ పరీక్ష ఎంతో కీలకం కానుంది. అవసరమైతే పోలీసులు బాధితురాలి డీఎన్ఏ ను కూడా సేకరించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 


మే 28వ తేదీన జరిగిన ఈ గ్యాంగ్‌ రేప్‌ కేసులో (Hyderabad Gang Rape Case) మొత్తం ఆరుగురు నిందితులు. వీరిలో ఒకరు 18 ఏళ్లు దాటిన మేజ‌ర్ కాగా, మిగిలిన ఐదుగురు మైన‌ర్ బాలురు. వీరిలో మైజర్ అయిన యువకుడు చంచల్ గూడ జైలులో ఉండగా, మైనర్లు సదాబాద్ లోని జువైన్ హోంలో ఉన్నారు. 


Also Read: గాల్లోనే సగం బిల్డింగ్, రాత్రిపూట కళ్లు జిగేల్! ఆశ్చర్యపోయిన విజయ్ దేవరకొండ, థమన్ - కేటీఆర్‌కి అభినందనలు


బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఈ గ్యాంగ్ రేప్ కేసులో (Minor Girl Gang Rape Case) నిందితులుగా ఉన్న మైనర్లు దాఖ‌లు చేసుకున్న బెయిల్ పిటిష‌న్లను (Bail Petition) హైదరాబాద్‌లోని జువెనైల్ జ‌స్టిస్ కోర్టు బుధవారం (జూన్ 22) తిర‌స్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుల‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు చేసిన వాద‌న‌ల‌ు చేయగా, కోర్టు వారితో ఏకీభ‌వించింది. దీంతో జువెనైల్ జ‌స్టిస్ బోర్డు నిందితుల బెయిల్ పిటిష‌న్లను కొట్టేసింది.


అయితే, న‌లుగురు మైన‌ర్లు సమాజంలో ప‌లుకుబ‌డి క‌లిగిన వారి పిల్లలేన‌ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసు ద‌ర్యాప్తు ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో వీరికి బెయిల్ ఇస్తే.. బాధితుల‌తో పాటు సాక్షుల‌ను కూడా నిందితుల కుటుంబాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉంద‌ని పోలీసులు తెలిపారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న జువెనైల్ జ‌స్టిస్ బోర్డు, నిందితులకు బెయిల్ నిరాక‌రిస్తూ వారి పిటిష‌న్లను కొట్టేసింది.


Also Read: Pesident Elections: వేట కుక్కల్లా ఉసిగొల్పుతున్నారు, అందుకే NDAకి సపోర్ట్ చెయ్యం: మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు