TS TET Results 2022 Online Direct Link: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) నిర్వహణకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా షెడ్యూల్ ప్రకారమే టెట్ నిర్వహించింది. రైల్వే రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ (RRB) అదే రోజున ఉందని పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోరినా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ క్రమంలో జూన్ 12న టెట్ నిర్వహించారు. నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. నేడు తెలంగాణ టెట్ 2022 ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.  టీచర్ పోస్టుల కోసం ఎదరుచూస్తున్న వారు టెట్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. కానీ టెట్ ఫలితాలు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. తేదీ ఖరారయ్యాక ప్రకటన విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ రాధారెడ్డి పేర్కొన్నారు.


నోటిఫికేషన్ ప్రకారం టెట్ 2022 ఫలితాలు 
టెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 12న టెట్ ఎగ్జామ్ నిర్వహించారు. జూన్ 27న ఫలితాల విడుదలతో పాటు టెట్ ఫైనల్ ఆన్సర్ కీ ని విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు. నేడు అధికారిక వెబ్‌సైట్ https://tstet.cgg.gov.in/ లో టెట్ అభ్యర్థులు తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. టెట్ పూర్తయిన తర్వాత తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది. ఆదివారం రాత్రి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. తేదీ ఖరారయ్యాక ప్రకటన విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ రాధారెడ్డి పేర్కొన్నారు.


టెట్ 2022లో మార్పులు..
ఈ ఏడాది టెట్‌లో జరిగిన మార్పుల కారణంగా పేపర్‌ 1, పేపర్‌ 2 కలిపి మొత్తం 3,79,101 మంది అభ్యర్ధులు టెట్ 2022కు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ పరీక్ష జూన్‌ 12 న మొత్తం 33 జిల్లాల్లో జరగనుంది. జూన్ 27న ఫలితాలు విడుదల చేయనున్నట్లు షెడ్యూల్‌లో ప్రకటించారు. కాగా, పేపర్‌-1, పేపర్-2 రెండు పరీక్షలు ఒకటే రోజు జరగనున్నాయి. పేపర్‌ -1 ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటలకు, పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం 2:30 నిముషాల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ భర్తీకి ప్రకటన చేయగా.. టీచర్ పోస్టులున్నాయి. సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 పోస్టులు, 6,500 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2000, ల్యాంగ్వేజ్ పండిట్ పోస్టులు 600 వరకు ఉన్నాయి. వీటి భర్తి నేపథ్యంలో టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


ఈ ఏడాది టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. గతంలో డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది.  కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు (B.ed Candidates) కూడా టెట్ పేపర్ 1 రాసే అవకాశం కల్పించారు.