హైదరాబాద్‌లోని సలీమ్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం నగరంలోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసారాంబాగ్, సలీం నగర్‌లో ఉన్న శ్రీవాణి హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. చిన్నగా మొదలైన మంటలు నిమిషాల వ్యవధిలో దట్టమైన పొగలుగా మారి ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. ఆసుపత్రి ప్రాంగణంలో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది రోగులను మరో భవనంలోకి తరలించారు.
ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఆసుపత్రిలో ఎంత మంది పేషెంట్లు, సిబ్బంది ఉన్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీవాణి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కనే ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు ఫైరింజన్‌కు, పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. అయితే ప్రమాదం వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
కాగా, గతంలో ఈ హాస్పిటల్ పేరు ఫర్హాత్ హాస్పిటల్ పేరు మీద ఉండేది. ఇటీవల శ్రీవాణి హాస్పిటల్‌గా పేరు మార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూ వల్ల జరిగిందా, మరే కారణం వల్ల జరిగిందా అనే విషయంపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. ఫైర్ సిబ్బంది సహకారంతో మంటల్ని ఆర్పివేశామని హైదరాబాద్ పోలీసులు ఏబీపీ దేశం ట్వీట్‌పై స్పందించారు.
Also Read: Guntur Beggar Murder : ఇడ్లీ ఇస్తే తీసుకోలేదని యాచకుడి హత్య, దర్యాప్తులో షాకింగ్ విషయాలు