Bandlaguda Keerthi Richmond Villas Ganesh Laddu Auction: గణేష్ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఎక్కడ ఎంత గ్రాండ్‌గా జరిగిన తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు జరిగే తీరు మాత్రం చాలా స్పెషల్. ఇక్కడ విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం, లడ్డూ వేలం ఇలా ప్రతి ఒక్క ఘట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా ఎన్నెన్ని విగ్రహాలు పెడుతున్నా... అందరి చూపు తెలుగు రాష్ట్రాల వైపు ఉంటుంది. 


మరోసారి తమ స్పెషాలిటీ నిరూపించుకున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని పూజా కమిటీలు. వైవిధ్యమైన విగ్రహాలు ఏర్పాటులోనే కాకుండా లడ్డూ వేలం పాటలో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ టాక్‌ఆఫ్‌ది కంట్రీగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో టాప్‌ ప్లేస్‌లోనే నిలిచటింది కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌ గణేషుడు. 


Also Read: బాలాపూర్‌ లడ్డూ వేలంలో కొత్త రూల్‌- ఆ డబ్బు డిపాజిట్ చేస్తేనే పాటలో పాల్గొనే ఛాన్స్


హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో ఉంది కీర్తి రిచ్‌మండ్‌ విల్లా. అక్కడ ఏటా భారీ ధరకు లడ్డూ వేలం పాట నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఉన్న వాళ్లంతా ధనవంతులు కావడంతో లడ్డూ వేలం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గనట్టుగా వేలం పాట జరిగింది. రికార్డు ధరకు లడ్డూను పాడుకున్నారు భక్తులు. 



కీర్తి రిచ్‌మండ్ విల్లాలో నిర్వహించిన లడ్డూ వేలంలో కమ్యూనిటీ మొత్తం పాల్గొంది. గణపతి లడ్డూను కోటీ 87 లక్షలకు సొంతం చేసుకుంది. గతంలో కూడా ఇక్కడ రికార్డు స్థాయిలో లడ్డూ అమ్ముడు పోయింది. గతేడాది కోటీ 26 లక్షలకు ఇక్కడ లడ్డు వేలంలో అమ్మడుుపోయింది. ఈసారి కూడా అంతకు మించి అన్నట్టు భక్తులు భారీ ధర పెట్టి లడ్డూను పాడుకున్నారు. ఇప్పుడు ఇదే అందరిలో చర్చనీయాంశంగా మారింది. 


ఈ మధ్య హైటెక్ సిటీలో ఉన్న మైహోం భూజాలో లడ్డూ వేలం వేస్తే అక్కడ కూడా రికార్డు స్థాయి ధరకు గణేష్ లడ్డూ అమ్ముడు పోయింది. 29 లక్షల రూపాయలకు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి లడ్డూను కొనుగోలు చేశారు. ఆదివారం చేపట్టిన వేలంలో ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన వ్యాపారవేత్త కొండపల్లి గణేశ్ 29 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది ఇక్కడ లడ్డూ 25.50 లక్షలు పలికింది. 


రంగారెడ్డి జిల్లా చేవెళ్లమండలం ముడిమ్యాలలోని గణేశ్ లడ్డూను అదే గ్రామానికి చెందిన హరికిషన్‌ రెడ్డి 12.16 లక్షలకు దక్కించుకున్నారు. అయితే ఎప్పుడూ కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణేశ్ లడ్డూ మాత్రం రికార్డు స్థాయి ధరలు పలుకుతుంది. ఇక్కడ లడ్డూ కోటి రూపాయలకు పైగానే వేలంలో వెళ్తుంది. 


Also Read: బాలాపూర్ లడ్డూ దక్కేది వీళ్లకే- ‍ఒక్క రూల్‌తో మొత్తం సీన్ మారిపోయిందిగా!