దిశ నిందితుల ఎన్ కౌంటర్ అంశంలో తన ప్రమేయం ఏమీ లేదని ఘటన గురించి తెలిసిన తర్వాత మాత్రమే అక్కడకు వెళ్లానని నాటి సైబరాబాద్ కమిషనర్, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్  జస్టిస్ సిర్ఫూర్కర్ కమిషన్‌కు తెలిపారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం అని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో విచారణ కోసం సిర్పూర్కర్ కమిషన్‌ను నియమించారు. ఈ కమిషన్ ఇప్పటికే ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితుల కుటుంబసభ్యులతో పాటు పోలీసులు, సాక్షులు అందర్నీ ప్రశ్నించింది. ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్‌గా చేసిన సజ్జనార్‌ను పిలిపించింది. 


Also Read : మెదక్‌లో నీచం.. భార్యకి, కొడుక్కీ ఒక అబ్బాయే లవర్.. రోజూ అదే పని.. చివరికి ఇంట్లో ఘోరం


విచారణలో సజ్జనార్‌పై సిర్పూర్కర్ కమిన్ ఆసక్తికరమైన ప్రశ్నలు వేసింది. అయితే ప్రతీ దానికి ఆయన శంషాబాద్ డీసీపీ పేరే ప్రస్తావించారు. అన్నీ ఆయనే చేశారన్న ట్లుగా చెప్పడంతో ఓ సందర్భలో సిర్పూర్కర్ కమిషన్..  అన్నింటికీ ఆయనపైనే ఆధారపడతారా అని కమిషన్ ప్రశ్నించింది. దానికి తాను అధికారులకు స్వేచ్చనిస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది.  న్ కౌంటర్ జరిగిన తర్వాతనే తనకు తెలిసిందని.. అలా జరిగిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని ఆదేశించానన్నారు. అయితే తన ఆదేశాలను పట్టించుకోని వారిని సస్పెండ్ చేసామని గుర్తు చేశారు. 


Also Read : అన్న కాపురం చక్కదిద్దే ప్రయత్నం... హత్యకు గురైన తమ్ముడు... మిస్టరీ డెత్


పత్రికల్లో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ అని ప్రచారం చేశారని..  ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటని సజ్జనార్‌ను సిర్ఫూర్కర్ కమిషన్ ప్రశ్నించింది.. తనకు తెలియదని.. తాను ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌ను కాదని ఆయన జవాబిచ్చారు. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో విచారణ ముగియక ముందే మీడియా సమావేశం నిర్వహించడం వల్ల విచారణ సరిగా చేయలేకపోయామనిని సాక్షులు చెప్పారని.. అలాఎందుకు చేశారని ప్రశ్నించారు. మీడియా సమావేశాన్ని దూరంగా ఏర్పాటు చేశామని సజ్జనార్ వివరించారు. వెపన్స్ స్వాధీనం చేసుకోకుండానే ఎలా మీడియా సమావేశం పెట్టారని ప్రశ్నిస్తే.. తనకు డీసీపీ చెప్పారని సమాధానం చెప్పారు. 


Also Read: పోలీసులు వేధిస్తున్నారని యువకుడు ఆత్మహత్యాయత్నం ... వైరల్ అయిన వీడియో


మీడియా సమావేశానికి కావాల్సిన ఏర్పాట్లను అంత వేగంగా ఎలా చేశారని సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది. షాద్ నగర్ పోలీసులు ఏర్పాట్లు చేశారని.. ఎలా తెచ్చారో తనకు తెలియదన్నారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటల అంశంపైనా విరవణ ఇచ్చారు. తన మాతృభాష తెలుగు కాదని.. అందుకే భావ వ్యక్తీకరణలో తప్పులు దొర్లాయన్నారు. విచారణ తర్వాత సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పిస్తుంది. 


Also Read : ఇంట్లో తల్లి శవం.. రెండ్రోజులుగా పెద్ద శబ్దాలు, ఏంటని ఆరా తీసి షాకైన పోలీసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి