ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు తనను పోలీసులు వేధిస్తున్నారంటూ పురుగుల మందు డబ్బాతో తీసిన వీడియో వైరల్ అవుతోంది. అడవితో ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాని ఓ యువకుడు వీడియో సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. చిన్న గొడవకు సంబంధించి తనను సత్తుపల్లి సీఐ రమాకాంత్, కానిస్టేబుళ్లు రాజకీయ నాయకులతో కలిసి వేధిస్తున్నారని అతడు వీడియో ఆరోపణలు చేశాడు. మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్‌కు తిప్పించి రోజూ తిడుతున్నారని ఆరోపించాడు. తనను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నారని వారి వేధింపులు భరించలేక చచ్చిపోవడమే మంచిదనుకుంటున్నా అని వీడియో పెట్టాడు. సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామానికి చెందిన తాటి జంపన్న అనే యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు వైరల్ అయ్యాయి.
Also Read: నిద్రపోతున్న ఫ్యామిలీపై కూలిన పైకప్పు.. శాశ్వత నిద్రలోకి ఐదుగురు.. సీఎం దిగ్భ్రాంతి
బస్సులో ఘర్షణ
అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన థర్మసోత్ భాను, తాటి జంపన్న బస్సులో ఐదు రోజుల క్రితం ఘర్షణ పడ్డారు. రెండు రోజుల క్రితం యాతాలకుంటలో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఎంతకూ రాజీ కుదరకపోవడంతో విద్యార్థి భాను తండ్రి థర్మసోతు నర్సింహారావు కొడుకుతో కలిసి సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో తాటి జంపన్నపై ఫిర్యాదు చేశారు. మూడు రోజుల నుంచి జంపన్నను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. శుక్రవారం జంపన్న కుటుంబ సభ్యులు స్టేషన్‌కు వచ్చి పోలీసులను ప్రాథేయపడటంతో రాత్రికి ఇంటికి పంపించారు. తిరిగి ఠాణాకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే జంపన్న శనివారం ఉదయం చెరుకుపల్లి తోగు వద్ద నుంచి అడవిలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు.
Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..
అడవిలో గాలింపు
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో గ్రామస్తులు, పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు అప్రమత్తమై జంపన్న సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేసి, సాయంత్రం 6.30 గంటల సమయంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ వియషమై సత్తుపల్లి పట్టణ సీఐ ఎ.రమాకాంత్‌ను వివరణ కోరగా, జంపన్ననను స్టేషన్‌లో విచారించామని, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని తెలిపారు. సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం జంపన్నను తరలించామని చెప్పారు.
Also Read: ఇంట్లో తల్లి శవం.. రెండ్రోజులుగా పెద్ద శబ్దాలు, ఏంటని ఆరా తీసి షాకైన పోలీసులు