NEET Phase 2 Registration: నేటితో ముగియనున్న నీట్ యూజీ సవరణలు.. ఇవి చేయడం మర్చిపోకండి..

NEET UG Phase 2 Registration 2021: నీట్ యూజీ 2021 ఫేజ్ 2 దరఖాస్తు ప్రక్రియ నేటితో (అక్టోబర్ 10) ముగియనుందని జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఫేజ్ 2 ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను సవరించుకోవచ్చు.

Continues below advertisement

దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశాలకు నిర్వహించే నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ ) -2021 అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) విద్యార్థులకు గమనిక. నీట్ యూజీ ఫేజ్ 2 (NEET UG Phase 2) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజుతో (అక్టోబర్ 10) ముగియనుంది. ఈ నెల 1న ప్రారంభమైన ఫేజ్ 2 ప్రక్రియ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను సవరించుకోవచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ (NTA) వెల్లడించింది. దీంతో పాటుగా మరిన్ని వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఎన్టీఏ పేర్కొన్న వివరాలను అందించని అభ్యర్థులకు నీట్ యూజీ ఫలితాలను వెల్లడించబోమని స్పష్టం చేసింది. నీట్ యూజీ ఫేజ్ 2 ప్రక్రియకు సంబంధించిన వివరాల కోసం https://neet.nta.nic.in/, www.nta.ac.in వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు లేదా neet@nta.ac.in అడ్రస్‌కు ఈమెయిల్ చేయవచ్చు. 

Continues below advertisement

Also Read: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాల‌ర్‌షిప్‌.. ఏడాదికి రూ.38,500 సాయం..

ఫేజ్ 1 అభ్యర్థులకు సవరణలకు ఛాన్స్.. 
నీట్ యూజీ - 2021 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫేజ్ 1లో (మొదటి దశ) భాగంగా తమ వివరాలను అందించి రిజిస్టర్ చేసుకోవడంతో పాటు ఎగ్జామ్ ఫీజు చెల్లించారు. ఫేజ్ 2లో అభ్యర్థులు తమ 11, 12 (XI, XII) తరగతులకు చెందిన వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫేజ్ 1 రిజిస్టర్ ప్రక్రియలో అందించిన జెండర్, ఈమెయిల్ అడ్రస్, నేషనాలటీ, కేటగిరీ తదితర వివరాల సవరణలకు (ఎడిట్) ఎన్టీఏ అవకాశం కల్పించింది. దీనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఫేజ్ 2 రిజిస్ట్రేషన్లను పూర్తి చేయని విద్యార్థుల అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోబోమని.. అలాంటి వారి నీట్ ఫలితాలను వెల్లడించబోమని పేర్కొంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రొవిజనల్ ఆన్సర్ కీని (provisional answer key) విడుదల చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. 

Also Read: నేడు సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష.. అభ్యర్థులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్​న్యూస్​.. ఉచిత రవాణా సదుపాయం..

నీట్ ఫేజ్ 2లో ఏమేం వివరాలు అందించాలి?  
1. నివాస ప్రదేశం (Place of Residence)
2. మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ (Mode of preparation)
3. 11, 12 తరగతులను ఏ ఏడాదిలో పూర్తి చేశారు, పాఠశాల పేరు, మార్కులు తదితర వివరాలు. 
4. తల్లిదండ్రుల ఆదాయ వివరాలు 

Also Read: ఆ విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త.. కొవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో బోర్డు కీలక ప్రకటన

Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Continues below advertisement
Sponsored Links by Taboola