బంగారం అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు అధికారులు ఎంతో కఠినమైన చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. తరచూ ఎవరో ఒకరు వినూత్న రీతిలో బంగారాన్ని తరలిస్తూ పట్టుబడుతున్నారు. ముఖ్యంగా శంషాబాద్‌ విమానాశ్రయం కేంద్రంగా ఇటీవల తరచూ బంగారం పట్టుబడుతోంది. చొక్కాల అంచుల్లో, బూట్లలో, విగ్గులో బంగారం తరలిస్తూ ఎంతో మంది పట్టుబడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో రీతిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ దుండగులు కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. 


Also Read: లవర్ ని పార్క్ తీసుకెళ్లడం విన్నాం.. కానీ ఈ మహానుభావుడు ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా?


ఫేస్‌ క్రీమ్‌ ఉండే ట్యూబుల్లో, డబ్బాల్లో బంగారం తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులకు దుండగులు అడ్డంగా దొరికిపోయారు. దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు అక్రమంగా తీసుకువచ్చిన 528 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ తెలియకుండా ఫేస్‌ క్రీమ్‌ డబ్బాల్లో నిందితుడు ఈ బంగారాన్ని తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఈ బంగారం విలువ సుమారు రూ.20.44 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, వారిని ప్రశ్నిస్తూ విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.


Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..


ఇటీవలే మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ఓ ప్రయాణికుడు తన మల ద్వారంలో బంగారాన్ని పెట్టుకొని తరలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. తాజాగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టులో బంగారం, వెండిని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దోహా నుంచి హైదరాబాద్‌కు 6ఈ 1714 విమానంలో వచ్చిన ఒక ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని.. అతనితోపాటు తెచ్చిన సామగ్రిని తనిఖీ చేశారు. 


Also Read: Woman Death: ఇంట్లో తల్లి శవం.. రెండ్రోజులుగా పెద్ద శబ్దాలు, ఏంటని ఆరా తీసి షాకైన పోలీసులు


ఈ క్రమంలో బ్యాగులో ఫేస్‌ క్రీమ్‌ రూపంలో దాచిన 528.02 గ్రాముల బంగారం, 28 గ్రాముల వెండి లభించినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. వీటి విలువ రూ. 20.44 లక్షలు ఉంటుందని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా బంగారం, వెండి తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ట్వీట్ చేశారు.


Also Read: యువతి సమయస్ఫూర్తి.. దిశా యాప్ ద్వారా ఆకతాయి ఆట కట్టించిన పోలీసులు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి