మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో భాగంగా హీరో నందమూరి బాలకృష్ణ ఆదివారం తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఓటు వేసిన తర్వాత ఆయన కాసేపు మీడియాతో మాట్లాడారు. ఈ రెండు ప్యానల్‌లో ఎవరు బాగా పనిచేస్తారని భావిస్తారని అడిగిన ప్రశ్నకు బాలయ్య సమాధానమిస్తూ.. ‘‘ఎవరో బాగా పనిచేస్తారని అనిపించిందో వారికే ఓటు వేశాను. ఇద్దరు బాగానే పనిచేసేలా ఉన్నారు. ఇద్దరి మీద నాకు నమ్మకం ఉంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు అన్నదమ్ముల్లాంటివారే. మాటలు చెప్పడమే కాదు చేసి చూపించాలి కూడా. మాలో మాకు ఎలాంటి విభేదాలు లేవు. వర్గాలు కూడా లేవు. రేపు అంతా షూటింగుల్లో కలిసేవాళ్లమే. కలిసి పనిచేసేవాళ్లమే. పేద, మధ్యతరగతి, దారిద్ర్య రేఖ దిగువలో ఉన్న కళాకారుల అవసరాలు, ఇన్సురెన్సులు అందేలా చేసే బాధ్యత గెలిచేవారిదే. ఎవరు గెలిచినా.. వారి వెనుక ఉండి నడిపిస్తారు. ఎన్నికలన్నాక ఆ మాత్రం హడావిడి ఉంటుంది. కానీ, ‘మా’లో ఎన్నడూ ఇంత హడావిడి లేదు. గెలిచినవాళ్లపైనే భారం వదిలేయడం కాదు, ఆర్టిస్టులు కూడా తమ వంతు సాయం చేయాలి’’ అని అన్నారు. 


మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఓటును వేశారు. అయితే తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని చిరంజీవి చెప్పారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని పేర్కొ్న్నారు. ఎన్నికల ఇంత హీట్ పుట్టిస్తున్నాయేంటని.. మీడియా అడిగిన ప్రశ్నకు అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడీగా ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదని చిరు చెప్పారు. భవిష్యత్‌ ఇలా జరగకుండా ఉండేలా మా ప్రయత్నాలు చేస్తామన్నారు. 'మా' ఎన్నికల్లో ఓటు వేయకపోవడం వాళ్ల వ్యక్తిగత విషయమని చిరంజీవి అన్నారు.


Also Read: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!


పోలింగ్ కేంద్రంలో డ్రెస్ కోడ్: పోలింగ్ సందర్భంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ అభ్యర్థులు డ్రెస్ కోడ్ పాటించారు. ప్రకాష్ రాజ్ టీమ్ గ్రీన్ కలర్‌లో, మంచు విష్ణు టీమ్ రెడ్ కలర్ దుస్తుల్లో కనిపించారు. అయితే, పోలింగ్ కేంద్రం లోపల ప్రకాష్ రాజ్, విష్ణు సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. మాట మాట పెరగడంతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి