మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా కుటుంబాన్ని రాజకీయంగా అణచివేసేందుకు చాలా మంది ప్రయత్నించారని తెలిపారు. వీరిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక్కరన్నారు. కానీ ఆయన కంటే ముందు కొండా ఫ్యామిలీకి మంత్రి పదవి దక్కిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తమను తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నన్ని రోజులు ఆ పార్టీకి దూరంగా ఉంటామని తేల్చిచెప్పామని కొండా సురేఖ తెలిపారు. మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీని వీడానని ఆమె స్పష్టం చేశారు. కొండా మురళి కుటుంబంపై రాంగోపాల్ వర్మ తీసే సినిమా ఒక చరిత్ర సృష్టిస్తుందన్నారు. కొండా జీవిత చరిత్రలో రాజకీయంతో పాటు ప్రేమ చరిత్ర కూడా ఉంటుందన్నారు. ఈ రెండు అంశాలతో ఆర్జీవీ తీస్తున్న సినిమా యావత్ లోకానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 


Also Read:  కొండా మురళి, సురేఖల బయోపిక్‌పై ఆర్జీవీ గురి ! మళ్లీ వివాదం తప్పదా ?


తెలంగాణ రక్త చరిత్ర


హనుమకొండ జిల్లా కేంద్రంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ సందడి చేశారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవితం ఆధారంగా ఆర్జీవీ కొండా బయోపిక్ షూటింగ్ కోసం ఆయన హనుమకొండకు వచ్చారు. వర్మకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ మంత్రి కొండా సురేఖ స్వాగతం పలికారు. వంచనగరిలో కొండా సినిమాను ప్రారంభించడానికి వర్మ వచ్చారు. వర్మ రాకతో స్థానికంగా సందడి వాతావరణం నెలకొంది. వర్మను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. బయోపిక్ లకు కేరాఫ్ అడ్రస్ రామ్​గోపాల్ వర్మ హారర్, ఫ్యాక్షనిజం, రౌడీయిజం కథాంశాలతో పలు చిత్రాలు తెరకెక్కించారు. విభిన్న స్టోరీలతో వర్మ మరింత పాపులర్ అయ్యారు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో సాగే 'రక్త చరిత్ర' సినిమా తీసిన ఆర్జీవీ ఇప్పుడు తెలంగాణలో జరిగిన రక్తచరిత్రపై సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. 




Also Read: ఆర్జీవీ 'కొండా' సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది..


ఆర్జీవీ మార్క్


నిజజీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు డిఫరెంట్ స్టయిల్ ఉంది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లు, రాజకీయ నాయకులు, సినీ తారలు ఇలా ఎవరి జీవితం ఆధారంగానైనా సినిమాలు చేశారు. పరిటాల రవి జీవిత కథాంశంతో వర్మ తెరకెక్కించిన 'రక్తచరిత్ర' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యింది. ఇదే తరహాలో ఆయన మరో రాజకీయ నేత నిజ జీవిత కథను సినిమాగా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్ రావు, సురేఖ దంపతుల జీవితాన్ని ఆర్జీవీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాకి 'కొండా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 


Also Read: 'కొండా' తెలంగాణ 'రక్త చరిత్ర' అవుతుందన్న ఆర్జీవీ..ఆకట్టుకుంటున్న పోస్టర్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి