అల్లు అర్జున్-రష్మిక-సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న పుష్ప సినిమాకు సంబంధించి శ్రీవల్లి సాంగ్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ‘చూపే బంగారమాయెనే..మాటే మాణిక్య మాయెనే  శ్రీవల్లి’ అంటూ సాగే సాంగ్ కూల్ గా ఉంది.
ఇప్పటికే విడుదలైన 'పుష్ప' ఫస్ట్ లుక్, టీజర్,  'దాక్కో దాక్కో మేక' సాంగ్ అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి.  ఇటీవల వచ్చిన శ్రీవల్లి లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ ను విడుదల చేయడానికి రెడీ అయ్యారు. దసరా సందర్భంగా అక్టోబర్ 13న 'శ్రీవల్లి' అనే పాటను ప్రేక్షకులకు అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘పుష్ప’ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ ‘దాక్కో దాక్కో మేక’ రీసెంట్ గా  80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా విడుదల చేసిన  ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి’ అంటూ సాగిన సాంగ్ ప్రోమోకి మంచి స్పందన వస్తోంది.  సిద్ శ్రీరామ్ పాడిన ఈ పూర్తి సాంగ్ ను వినడానికి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. 'రంగస్థలం' సినిమాలోని 'ఎంత చక్కగున్నావే' పాట తరహాలో పుష్ప సెకండ్ సింగిల్ ఉంటుందని అర్థం అవుతోంది.  ఈ సాంగ్ తెలుగు తమిళం మలయాళం కన్నడ లోనూ   సిద్ శ్రీరామ్ పాడటం విశేషం. హిందీలో మాత్రం జావేద్ అలీ ఆలపించాడు. ఈరోజు ఐదు భాషలకు సంబంధించిన ప్రోమోలను వదిలారు. తెలుగు పాటకు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. పూర్తి పాట రేపు(బుధవారం ) ఉదయం 11:07 గంటలకు విడుదలవుతుంది.


“పుష్ప: ది రైజ్-పార్ట్ 1” లో మలయాళ నటుడు ఫాహాద్ విలన్ గా నటిస్తున్నాడు.  శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా బన్నీ.. గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపించనుంది.  దేవిశ్రీ ప్రసాద్  ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘పుష్ప ది రైజ్’ 2021 డిసెంబర్ 17 న గ్రాండ్ రిలీజ్ కానుంది. 


Also Read:ఆకాష్ పూరీ, కేతిక శర్మ 'రొమాంటిక్' సాంగ్
Also Read: నా రాజీనా'మా' వెనుక లోతైన అర్థం ఉంది, త్వరలోనే చెబుతా అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్..
Also Read: రామ్ చరణ్-శంకర్ మూవీ షూటింగ్ ఈ నెల‌లోనే….చెర్రీ రెమ్యున‌రేష‌న్ పై హాట్ డిస్కషన్
Also Read: నిర్మాత, జూ.ఎన్టీఆర్‌ పీఆర్వో మహేశ్‌ కోనేరు మృతి
Also Read: 'మా' లో ఇంత అలజడి మంచిదికాదు…అలా జరిగి ఉంటే బావుండేదన్న రాఘవేంద్రరావు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి