జమ్ముకశ్మీర్ సోపియన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఘటనా స్థలి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏం జరిగింది?
సోపియన్ జిల్లా ఇమామ్ సాహెబ్ ప్రాంతం తుల్రాన్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. మృతి చెందిన ముగ్గురు తీవ్రవాదుల్లో ఒకరు సోపియన్ జిల్లా గందేర్బల్ జిల్లాకు చెందినవాడని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
ఐదుగురు జవాన్లు వీరమరణం..
జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో నిన్న ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జూనియర్ కమిషన్‌డ్ ఆఫీసర్ (జేసీఓ) సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పిర్ పంజల్ రేంజ్ వద్ద జరిపిన కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో ఈ ఘటన జరిగింది.
జమ్ముకశ్మీర్ పూంఛ్ ప్రాంతంలో ముగ్గురు ముష్కరులు ఉన్నారనే సమాచారం భారత్ ఆర్మీకి వచ్చింది. వారిని పట్టుకునేందుకు భారత సైన్యం గాలింపు చేపట్టారు. బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మొత్తం ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
కాల్పుల కలకలం..
జమ్ముకశ్మీర్‌లో పౌరులపై ఇటీవల ఉగ్రవాదుల కాల్పులు ఎక్కువయ్యాయి. జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల కాల్పులు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు. ఈ ఘటనతో జమ్ముకశ్మీర్‌లో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
దీంతో పోలీసులు ఉగ్ర ఏరివేత చర్యలు చేపట్టారు. బందిపొరాలో లష్కర్ ఏ తోయిబా(ఎల్ఈటీ) ఉగ్ర స్థావరాన్ని పోలీసులు ఛేదించారు. నైద్ఖాయ్కు చెందిన మహమ్మద్ షఫీ లోనే అలియాస్ సోను అనే వ్యక్తి హత్య కుట్రలో భాగమైన నలుగురు ఉగ్ర అనుచరులను అరెస్టు చేశారు.
ఐకాల్ ఎన్18 కాలింగ్ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫ్యూజన్5 4జీ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి