విన‌య విధేయ రామ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ హడావుడి ముగియడంతో తదుపరి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. శంకర్‌ దర్శకత్వంలో రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది.  ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 21న పుణేలో ప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పుణేలో సెట్‌ వర్క్‌ కూడా పూర్తి కావొచ్చిందట.  
Also Read: 'మా' లో ఇంత అలజడి మంచిదికాదు…అలా జరిగి ఉంటే బావుండేదన్న రాఘవేంద్రరావు
ఈ సినిమాలో రామ్ చరణ్ రెమ్యునరేషన్ గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ చర్చ జరుగుతోంది. ఈ మూవీ చరణ్‌కి 15 వది కాగా, నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కి 50 సినిమా. అందుకే నిర్మాత దిల్ రాజు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. చరణ్ ఈ సినిమాకి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది.  ఇదే నిజమైతే టాలీవుడ్‌లో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలలో ప్రభాస్ తర్వాత చరణ్ అవుతాడు. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా, అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు. ఇందులో చరణ్ ఐపీఎస్ గా కనిపించనున్నాడు. దీనికి విశ్వంభర అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 
Also Read: 'పాన్ మసాలా' వద్దన్న అమితాబ్.. ఇప్పుడు అందరి చూపూ మహేశ్ బాబు వైపే..
ఎన్టీఆర్-రామ్ చరణ్-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'ఆర్ ఆర్ ఆర్ ' సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు  ఇప్పటికే ప్రకటించారు.  విడుదల తేది దగ్గరపడుతుండడంతో టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం టీమ్‌లో ఒక్కరుగా డబ్బింగ్ చెప్పుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు తమ డబ్బింగ్‌ను పూర్తి చేయగా.. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ మొదలు పెట్టారు.
Also Read: నా రాజీనా'మా' వెనుక లోతైన అర్థం ఉంది, త్వరలోనే చెబుతా అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్..
Also Read: "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?
Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి