టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ పీఆర్‌ఓ, ఈ‍స్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ ప్రొడ్యూసర్‌ మహేశ్‌ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహేశ్‌ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. మహేష్ మృతి పట్ల స్పందించిన ఎన్టీఆర్ ఈ వార్త తెలిసి షాక్ కు గురయ్యానని తెలిపారు. బరువెక్కిన హృదయంతో చెబుతున్నా.. నా ఆప్త మిత్రుడు మహేష్ కోనేరు ఇక లేరు. నాకు మాటలు రావడం లేదు..మహేష్ కుటుంసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని ట్వీట్ చేశారు.





టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు.





‘అత్యంత ఆప్తుడిని, కుటుంబ సభ్యుడిని కోల్పోయాను.. మహేష్ కోనేరు మాకు వెన్నుముక. నాకు వ్యక్తిగతంగా  , ఇండస్ట్రీకి పెద్ద నష్టం ఆయన్ని కోల్పోవడం. మహేష్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అంటూ నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.






మహేశ్ కోనేరు చాలాకాలంగా  ఎన్టీఆర్‌కు మేనేజర్‌గా పనిచేస్తున్నారు.





 పలు సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరించారు.





 ఈస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ మీద ‘118’, ‘తిమ్మరుసు’, ‘మిస్ ఇండియా’ సినిమాలు నిర్మించిన మహేష్, విజయ్ ‘మాస్టర్’ మూవీని తెలుగులో రిలీజ్ చేశారు.





నిర్మాతగా మరిన్ని మంచి సినిమాలు తీసే ప్లాన్‌లో ఉన్న మహేష్ కోనేరు హఠాత్తుగా మరణించడంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.






రకుల్ ప్రీత్ సింగ్






లావణ్య త్రిపాఠి






కోన వెంకట్






బాబి






గోపీచంద్ మలినేని






సత్యదేవ్






నారారోహిత్






Also Read: నా రాజీనా'మా' వెనుక లోతైన అర్థం ఉంది, త్వరలోనే చెబుతా అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్..
Also Read: 'మా' లో ఇంత అలజడి మంచిదికాదు…అలా జరిగి ఉంటే బావుండేదన్న రాఘవేంద్రరావు
Also Read: 'పాన్ మసాలా' వద్దన్న అమితాబ్.. ఇప్పుడు అందరి చూపూ మహేశ్ బాబు వైపే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి