పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరీ హీరోగా వస్తోన్న చిత్రం 'రొమాంటిక్'.  కథ , స్క్రీన్ ప్లే,  డైలాగ్స్ పూరీ అందించిన ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఎప్పుడో పూర్తైనప్పటికీ కరోనా కారణంగా విడుదల వాయిదాపడుతూ వచ్చింది. ఇప్పుడిప్పుడే థియేటర్లలో సందడి పెరుగుతుండడంతో దివాలీ కానుకగా విడుదల చేయనున్నారు.  'రొమాంటిక్' మూవీని నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్..ఈ మేరకు ప్రమోషన్ జోరు పెంచారు. ఇందులో భాగంగా  వరుస అప్డేట్స్  ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా 'పీనే కే బాద్' అనే సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. 
భాస్కరబట్ల లిరిక్స్ అందించిన ఈ పాటను యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ ఈ  స్వరాలు సమకూర్చారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ.
'రొమాంటిక్' చిత్రం నుంచి ఇది వరకే విడుదలైన పోస్టర్స్, రెండు పాటలు మంచి స్పందన సంపాదించుకున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన 'పీనే కే బాద్' సాంగ్ కూడా అలరిస్తోంది.


ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తుండగా మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునయన ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. లావణ్య సమర్పణలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై 'రొమాంటిక్' సినిమా రూపొందుతోంది. 'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన ఆకాశ్ పూరీ  ‘ఆంధ్రపోరి’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత   తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే ‘మెహబూబా’ అనే సినిమాలో నటించాడు.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు  ‘రొమాంటిక్’ మూవీతో వస్తున్నాడు. ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు ఆకాశ్. ఎందుకంటే ఇప్పటి వరకూ నటించిన రెండు సినిమాలు సరైన సక్సెస్ ని ఇవ్వకపోవడంతో 'రొమాంటిక్' హీరోగా మంచి సక్సెస్ అందించాలనే ఆశతో ఉన్నాడు. 


Also Read:నా రాజీనా'మా' వెనుక లోతైన అర్థం ఉంది, త్వరలోనే చెబుతా అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్..
Also Read: రామ్ చరణ్-శంకర్ మూవీ షూటింగ్ ఈ నెల‌లోనే….చెర్రీ రెమ్యున‌రేష‌న్ పై హాట్ డిస్కషన్
Also Read: నిర్మాత, జూ.ఎన్టీఆర్‌ పీఆర్వో మహేశ్‌ కోనేరు మృతి
Also Read: 'మా' లో ఇంత అలజడి మంచిదికాదు…అలా జరిగి ఉంటే బావుండేదన్న రాఘవేంద్రరావు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి