చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నగొల్లపల్లెకు చెందిన రాజేష్, లావణ్య దంపతులు బెంగళూరులో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని జీవనం సాగించేవారు. పెళ్ళైన కొద్ది రోజుల వరకూ వీరి‌ కాపురం అన్యోన్యంగా సాగింది. వీరి మధ్య గత కొద్ది రోజులుగా చిన్న చిన్న గొడవలు తలెత్తాయి. ఈ విషయాన్ని లావణ్య తల్లిదండ్రులకు తెలియజేసింది. లావణ్య తల్లిదండ్రులు నారాయణ స్వామి, సులోచన కలుగజేసుకుని కుమార్తె లావణ్యను, అల్లుడు రాజేష్ ను కలిపేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. తరువాత గ్రామపెద్దల కల్పించుకున్నా‌ పంచాయితీ నిర్వహించారు. కానీ ఇద్దరు ఒక్కరిపై ఒక్కరు దాడులు చేసుకోవడంతో గ్రామ పెద్దలు ఏంచేయలేకపోయారు. దీంతో లావణ్య చిన్నగొల్లపల్లెలోని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. రాజేష్ బెంగళూరులో పనులు చేస్తుకుంటున్నాడు.


Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..


అన్న కాపురం చక్కదిద్దేందుకు


రాజేష్ అప్పుడప్పుడూ సొంత ఊరు చిన్నగొల్లపల్లెకు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే అన్న, వదినలను ఎలాగైనా కలపాలని రాజేష్ తమ్ముడు సురేష్ అతని భార్య శ్వేతలు నిర్ణయించుకుని సురేష్ భార్య శ్వేత లావణ్యను కాపురానికి పంపాలని లావణ్య తల్లిదండ్రులైన నారాయణస్వామి, సులోచనలను కోరింది. ఇందుకు నారాయణ స్వామి అంగీకరించలేదు. శ్వేతను అసభ్యకర పదజాలంతో దూషించి ఇంటి‌ నుంచి పంపేశారు. దీంతో ఆగ్రహించిన శ్వేత భర్త సురేష్, అన్న రాజేష్ తో కలిసి ఈ నెల 6న లావణ్య ఇంటికి వెళ్లి నారాయణ స్వామిని నిలదీశారు. తమ భార్య లావణ్యను ఎలాగైనా కాపురానికి పంపాలని రాజేష్ మామను‌ కోరాడు. తన కుమార్తెను కాపురానికి పంపనని నారాయణస్వామి తేల్చిచెప్పాడు. నారాయణస్వామి గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి రాజేష్, సురేష్ లపై దాడికి దిగారు. దాడిలో గాయపడిన అన్నదమ్ములు స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. అనంతరం సురేష్ గ్రామానికి తిరిగి వచ్చే సమయంలో నారాయణస్వామి మరో ముగ్గరితో కలిసి దాడి చేశాడు. సురేష్ మృతదేహాన్ని మొక్కజొన్న పొలంలో పాతి పెట్టాడు. 





Also Read: నిద్రపోతున్న ఫ్యామిలీపై కూలిన పైకప్పు.. శాశ్వత నిద్రలోకి ఐదుగురు.. సీఎం దిగ్భ్రాంతి


సురేష్ భార్య ఫిర్యాదుతో 


నారాయణ స్వామి ఇంటి వద్ద ఘర్షణ జరిగిన తరువాత సురేష్ ఆచూకీలేకపోవడంతో అనుమానం వచ్చిన అతని భార్య శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన గుడిపల్లె పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నారాయణస్వామి సురేష్ ను హత్యచేసినట్లు తెలిసింది. నారాయణ స్వామిని విచారించగా సురేష్ ను పాతిపెట్టిన స్థలానికి తీసుకెళ్ళాడు. తహసీల్దార్ సమక్షంలో సురేష్ మృతదేహాన్ని వెలికి తీసి శవ పరీక్షల నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందుతులు నారాయణ స్వామితో పాటుగా హంసగిరి, చంద్రబాబు, శ్రీనివాసులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 


Also Read: పోలీసులు వేధిస్తున్నారని యువకుడు ఆత్మహత్యాయత్నం ... వైరల్ అయిన వీడియో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి