రష్యాలో ఓ విమానం కూలిపోయింది. తతర్‌స్థాన్‌ ప్రాంతంలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో 19 మంది మరణించారు. ప్రమాద సమయంలో విమానంలో 22 మంది ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.










ఎలా జరిగింది?


రష్యాకు చెందిన ఎల్‌-410 తేలికపాటి విమానం 20 మంది స్కైడైవింగ్‌ క్లబ్‌ సభ్యులు, ఇద్దరు సిబ్బందితో బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే మెన్సెలిన్స్క్‌ పట్టణం సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ముందు ఈ విమానం రాడార్ల నుంచి అదృశ్యమైంది. 






ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చిందని సహాయక బృందాలు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. 


Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం


Also read: మగవారిని ఆ క్యాన్సర్ నుంచి కాపాడే దివ్యౌషధం దానిమ్మ... తినమని చెబుతున్న హార్వర్డ్ వైద్యులు


Also read: మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం... అధిక ఆలోచనలతోనే ముప్పు



Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి