ఎన్నడూలేని విధంగా ఈసారి 'మా' ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్  ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు ప్రకాష్ రాజ్ కి తమ మద్దతుని తెలియజేస్తున్నారు. రీసెంట్ గా నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మెగాఫ్యామిలీ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే ఉంటుందని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. 'మా' అధ్యక్షుడిగా పని చేసిన శివాజీరాజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. 


నాగబాబు సపోర్ట్ గనుక లేకపోతే నరేష్ అసలు 'మా' ఎన్నికల్లో సక్సెస్ అయ్యేవాడు కాదని అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో నరేష్ చిన్నపిల్లాడని.. ఎప్పుడూ అబద్ధాలు చెబుతూనే ఉంటారని.. ఆయన నోటి నుంచి నిజం వచ్చిన రోజు ఆశ్చర్యపోతా అంటూ విమర్శలు చేశారు. నరేష్ తనకు శత్రువు కాదని.. కానీ తనపై తప్పుడు ప్రచారాలు చేశాడని అన్నారు. తను 'మా' అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాలో ఓ ఈవెంట్ నిర్వహించామని.. ఇండస్ట్రీకి చెందిన చాలా మందిని అక్కడకు తీసుకెళ్లి ప్రోగ్రాం చేశామని శివాజీరాజా అన్నారు. ఆ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చారని గుర్తు చేసుకున్నారు. అయితే ఫ్లైట్ టికెట్స్ విషయంలో డబ్బులు వాడుకున్నామని ఆరోపణలు వచ్చేలా నరేష్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు శివాజీరాజా. 


దీనిపై కమిటీ వేసి నరేష్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చామని.. అయినప్పటికీ నరేష్ ఇప్పటివరకు సారీ చెప్పలేదని అన్నారు. నరేష్ రాకతోనే అసోసియేషన్ లో రాజకీయాలు మొదలయ్యాయని.. ఇప్పుడు 'మా' ఎన్నికలు రచ్చకెక్కడానికి కారణం కూడా ఆయనేనని అన్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెబుతారని నరేష్ పై కామెంట్ చేశారు. అతడి కారణంగా ప్రాణస్నేహితులు కూడా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. 


Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన


మరో ఇన్సిడెంట్ గురించి వివరిస్తూ.. ''మా సభ్యుల కోసం ఓ వృద్ధాశ్రమం నిర్మించాలనుకున్నాం. ఫండ్స్ కోసం అమెరికాలో మరో ప్రోగ్రాం చేయాలనుకున్నాం. మహేష్ బాబుకి ఆ విషయం చెప్పగానే.. 'నాకు ఓకే.. ఒకసారి నమ్రతను కలిసి విషయం చెప్పండి' అని అన్నారు. వెంటనే నరేష్ తో కలిసి మరో ఎనిమిది మంది సభ్యులు మహేష్ ఇంటికి వెళ్లి నమ్రతతో మాట్లాడాం. ఆమె కూడా ఓకే చెప్పారు. ప్రభాస్ ని అడిగితే షూటింగ్స్ తో బిజీగా ఉన్నానని చెప్పారు. కానీ తనవాటాగా రూ.2 కోట్లు ఇస్తానని చెప్పారు. ఇలా హీరోహీరోయిన్స్ అందరూ ఓకే చెప్పిన తరువాత నరేష్ ప్రెస్ మీట్ పెట్టి నాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తరువాత వెంటనే 'మా' ఎన్నికలు జరిగాయి. మా ప్యానెల్ ఓడిపోయింది. దాంతో అమెరికాలో చేయాలనుకున్న ప్రోగ్రాం ఆగిపోయింది'' అంటూ శివాజీరాజా అప్పటిపరిస్థితుల గురించి వివరించారు. ఈసారి జరుగుతున్న ఎన్నికలపై స్పందించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. 


Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర


Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!


Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి