రాజమౌళి.. ఒకప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన పేరు ఇది. కానీ, ఇప్పుడు రాజమౌళి కేవలం మనవాడే కాదు.. అందరి వాడు. యావత్ సినీ ప్రపంచానికి అతడి సత్తా ఏంటో తెలుసు. ‘బాహుబలి’ చిత్రంతో ఆయన దర్శక ప్రతిభ ఎల్లలు దాటింది. ఆయన క్రియేటివిటీ చూసి భారతీయ సినిమా ఇంత గొప్పగా ఉంటుందా అని హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. ఈ రోజు ఆయన పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో అంతా శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ సైతం ఆయనకో విజువల్ గిఫ్ట్‌ను అందించింది. ఆయన మొదటి చిత్రం ‘స్టూడెంట్ నెం.1’ నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ వరకు.. ఒక్కో ఒక్కో అడుగు ఎలా ముందుకేశారనేది చూపించారు. ఆయన సినిమాల్లోని సంగీతంతోనూ ఆయన గొప్పతనాన్ని విజువల్స్ ద్వారా చూపించారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడైన ఎస్ఎస్ రాజమౌళి అక్టోబరు 10న పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజమౌళి పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. కెరీర్ ఆరంభంలో రాజమౌళి దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మించిన ‘శాంతి నివాసం’ సీరియల్‌కు దర్శకత్వం వహించారు. 2001లో ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో హిట్ కొట్టి.. ప్రేక్షకుల మెప్పు పొందారు. సాధారణ ఒక దర్శకుడి సినిమా అంటే.. ఒకే శైలిలో ఉంటాయి. కానీ, రాజమౌళి సినిమాలు మాత్రం ముందు చిత్రానికి ఆ తర్వాతి చిత్రానికి అస్సలు సంబంధమే ఉండదు. ప్రతి చిత్రం ప్రత్యేకంగా ఉంటుంది. ఔట్ పుట్ విషయంలో అస్సలు రాజీపడరు. సినిమా రిలీజ్ తేదీలు వాయిదా పడటానికి కారణం కూడా ఇదే. ఇప్పటివరకు రాజమౌళి తీసిన ఒక్క చిత్రం కూడా ఫ్లాప్ కాలేదంటే.. ఆయన ఎంత కచ్చితంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ నుంచి సింహాద్రి, ఛత్రపతి, మగధీర, ఈగ, బాహుబలి వరకు ప్రతీది ప్రత్యేకమే. ఆయన చిత్రమంటే బాక్సాఫీసు బద్దలు కావాల్సిందే. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్‌లతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ 2022, జనవరి 7న విడుదల కానుంది.
Also Read: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి