సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా ఈ సీజన్లో సరిగ్గా ఆడలేకపోయాడని టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. కానీ అతడు మ్యాచ్ విన్నరని పేర్కొన్నాడు. దిల్లీతో క్వాలిఫయర్ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్ అతడిని ఆడించాలని సూచించాడు. క్షణాల్లో మ్యాచును మలుపు తిప్పగల సామర్థ్యం అతడికి ఉందని వెల్లడించాడు.
Also Read: మెస్సీ.. ఏడోసారి గెలుస్తాడా? రొనాల్డోతో పోటీపడుతున్న అర్జెంటీనా దిగ్గజం
'అనుభవం పరంగా చెప్పాలంటే చెన్నై సూపర్‌కింగ్స్ సురేశ్ రైనాను ప్లేఆఫ్స్‌లో ఆడించాలి. ఎందుకంటే అతడో మ్యాచ్ విన్నర్. కొన్నేళ్లుగా అతడు ఇబ్బంది పడుతున్నది నిజమే. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను ఆడలేకపోతున్నాడు. కానీ క్షణాల్లో మ్యాచులను మలుపు తిప్పగల సామర్థ్యం అతడి సొంతం. నిజమే, ఆన్రిచ్ నార్జ్, కాగిసో రబాడా, అవేశ్ ఖాన్ అతడిని పరీక్షిస్తారు. కానీ జట్టు ఫైనల్‌కే చేరుకొనేందుకు అతడికి అవకాశం ఇవ్వడంలో తప్పేం లేదు' అని సన్నీ అన్నాడు.
Also Read: డేవిడ్ వార్నర్ అంశంలో గుసగుసలెందుకు? ఏదో జరుగుతోందని సంజయ్ మంజ్రేకర్ అనుమానం!
సురేశ్ రైనా గత సీజన్లో ఆడలేదు. ఈ సీజన్లో 12 మ్యాచులాడిన అతడు 17.77 సగటుతో 160 పరుగులే చేశాడు. మోకాలి గాయం కావడంతో అతడి స్థానంలో రాబిన్ ఉతప్పను చెన్నై ఆడించింది.
Also Read: ఆఖరి బంతికి సిక్స్..! ఆ కిక్కులో ఆర్‌సీబీ చేసుకున్న సంబరాలు చూడండి
దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. అతడో సానుకూల బ్యాటరని పేర్కొన్నాడు. దిల్లీ, బెంగళూరు మంచి ఫామ్‌లో ఉన్నాయని వెల్లడించాడు. బ్యాటు, బంతితో రాణించగల ఆటగాళ్లు ఆ జట్లలో ఉన్నారని తెలిపాడు. పంత్ తన కెప్టెన్సీని మరింత మెరుగు పర్చుకుంటున్నాడని పేర్కొన్నాడు. లక్ష్యాలను ఎలా కాపాడాలో నేర్చుకున్నాడని, ఆఖరి రెండు ఓవర్లు వేసేందుకు అత్యుత్తమ ఇద్దరు బౌలర్లు అతడికి ఉన్నారని వెల్లడించాడు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి