రైలుకు ఇంజన్ ఎంత అవసరమో, మన శరీరానికి మెదడు అంత ముఖ్యం. మెదడు నుంచి వచ్చే ఆదేశాలే పనుల రూపంలో మన శరీరం నిర్వర్తిస్తుంది. ఆదేశాలిచ్చే మెదడే  ఆరోగ్యంగా లేకపోతే... ఆ ప్రభావం శరీరం మొత్తమ్మీద పడుతుంది. కానీ కనిపించని ఒత్తిడి, అనవసరపు ఆలోచనలు, కుటుంబ గొడవలు మనసును చెదిరేలా చేసి తద్వారా మెదడు ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 10న ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ నిర్వహిస్తారు.


శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఏ ఒక్కటి ఇబ్బందుల్లో పడినా రెండోది కూడా ప్రభావితం అవుతుంది. దీర్ఘకాలిక శారీరక సమస్యలు, మానసిక స్థితి పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే మానసికంగా ప్రశాంతంగా లేని వ్యక్తి శారీరకంగా కూడా నీరసంగా మారిపోతాడు. అవయవాల పనితీరు కూడా మారిపోతుంది. కాబట్టే చాలా జాగ్రత్తగా మానసిక, శారీరక ఆరోగ్యాలను బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. 


ఇవన్నీ మానసిక రోగాలే...
మానసిక వైకల్యాలు చాలా ఉన్నాయి. యాంగ్జయిటీ, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్,  ఫోబియా, మానియా, స్కిజోప్రినియా, డిల్యూషన్‌ డిజార్డర్‌, స్లిప్‌ డిజార్డర్‌, ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌, సుపీరియారిటీ కాంప్లెక్స్‌, ఇల్యూషన్‌, అడిక్షన్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మానసిక ఉద్రేకాలను అణచుకోలేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు కలుగుతాయి. వీటికి తగిన చికిత్సలు కూడా ఉన్నాయి. ఎంతో మంది మానసిక వైద్యులు మానసిక రోగులకు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. 


చరిత్ర...
ప్రపంచ మానసిక దినోత్సవాన్ని తొలిసారి 1992, అక్టోబర్ 10న నిర్వహించారు. 150కి పైగా దేశాలు సభ్యులుగా ఉన్న ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పట్నించి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. వివిధ దేశాల ఆరోగ్య మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రజల్లో మానసిక ఆరోగ్యం అవగాహన పెంచే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. 


Also read: మగవారిని ఆ క్యాన్సర్ నుంచి కాపాడే దివ్యౌషధం దానిమ్మ... తినమని చెబుతున్న హార్వర్డ్ వైద్యులు


Also read: గాలిబుడగలు పేల్చే అలవాటు మీకూ ఉందా? కొత్త అధ్యయనం ఏం చెబుతుందంటే...


Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం


Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం


Also read: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా? ఆరోగ్యకరమైన పద్ధతులు ఇవిగో...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి