తెలంగాణ నిజామాబాద్‌లో కిడ్నాప్ గురైన మూడేళ్ల చిన్నారి అస్ కియా ఆచూకీ దొరికింది. మహారాష్ట్ర నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు చిన్నారిని వదిలిపెట్టి వెళ్లారు. పోలీసులు పాపను నిజామాబాద్ తీసుకోస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల సాయంతో కిడ్నాప్‌ మిస్టరీని ఛేదించారు తెలంగాణ పోలీసులు. శుక్రవారం నిజామాబాద్​ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద చిన్నారిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని పాప తల్లింద్రులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మూడు రోజులకు పాప ఆచూకీ లభ్యం అయ్యింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టగా... కిడ్నాపర్లు మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు గుర్తించారు. 




Also Read: యువతి సమయస్ఫూర్తి.. దిశా యాప్ ద్వారా ఆకతాయి ఆట కట్టించిన పోలీసులు..


బుర్ఖాలో వచ్చిన మహిళ..


జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన నూరేన్‌ తన తల్లి, మూడేళ్ల కూతురు అస్ కియాతో కలిసి శుక్రవారం నిజామాబాద్‌ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు వచ్చారు. కుటుంబసభ్యులు షాపింగ్‌ పూర్తిచేసుకుని బిల్లు చెల్లిస్తున్న సమయంలో చిన్నారి అస్‌కియా కనిపించలేదు. తన కూతురు ఆచూకీ తెలియకపోవడంతో తల్లి షాపింగ్‌మాల్‌ సిబ్బందికి విషయాన్ని తెలిపింది. దీంతో వాళ్లంతా షాపింగ్ మాల్ వెతికారు. ఎక్కడా చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారమివ్వడంతో సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ టీవీ దృశ్యాల్లో మహిళ బుర్ఖాలో వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. చిన్నారి గాలింపు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. చిన్నారి కిడ్నాప్ అయ్యి రెండు రోజులు గడిచిపోయిన ఆచూకీ లభించలేదు. ఈ కేసులో నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గాలింపు వేగవంతం చేశారు. జిల్లా సరిహద్దులు, చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా గాలించారు. అప్పటికీ చిన్నారికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు పాపను వదిలివెళ్లినట్లు స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Also Read: ఫేస్ క్రీముల్లో బంగారం ఉంచి స్మగ్లింగ్.. ఎలా సాధ్యమంటే.. వీడియో రిలీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు


Also Read: Woman Death: ఇంట్లో తల్లి శవం.. రెండ్రోజులుగా పెద్ద శబ్దాలు, ఏంటని ఆరా తీసి షాకైన పోలీసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి