టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ పై ఏపీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. తాడేపల్లిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని విమర్శించారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన ఘటన చంద్రబాబుదే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీని ప్రజలు చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో బద్వేలు ఉపఎన్నిక నుంచి టీడీపీ పారిపోయిందని ఆరోపించారు. చంద్రబాబుకు ఇంక గెలుపుపై నమ్మకం పోయిందన్నారు. అందుకే దత్తపుత్రుడు పవన్ వైపు చూస్తున్నారని ఆరోపించారు. 


Also Read:  ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్‌ జస్టిస్‌లు.. అధికారికంగా ప్రకటించిన న్యాయ మంత్రి !


పవన్ ఓ సామాజిక వర్గానికి అండగా...


టీడీపీని జనసేనలో విలీనం చేయాలని కొడాలి నాని వ్యాఖ్యానించారు. పవన్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అన్న మంత్రి.. వైస్సార్సీపీ విజయాలతో పవన్‌ కల్యాణ్‌కు మైండ్‌ బ్లాక్‌ అయిందన్నారు. రాజకీయ పార్టీలు బలహీన వర్గాలకు అండగా ఉంటే పవన్‌ మాత్రం ఓ సామాజిక వర్గానికి అండగా ఉంటున్నారని విమర్శలు చేశారు. డ్రగ్స్‌ వ్యవహారంలో చంద్రబాబు, టీడీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలోనే ఉత్తరాంధ్ర నుంచి గంజాయి స్మగ్లింగ్‌ జరిగిందని కొడాలి నాని అన్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే డ్వాక్రా సంఘాలు ఏర్పాటయ్యాయని మంత్రి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలిచ్చి ప్రోత్సహించారన్నారు. టీడీపీ అధికారంలోని వచ్చాక డ్వాక్రా సంఘాలు తగ్గిపోయాయని ఆరోపించారు. 


Also Read: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జనసేన పార్టీ ఏర్పాటు... మార్పు కోసం దెబ్బలు తినటానికైనా సిద్ధం... జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు


రాజకీయంగా అడ్రస్ గల్లంతు


చంద్రబాబు, పవన్ ఇప్పటికే ఏపీలో రాజకీయంగా అడ్రస్ లేరని మంత్రి కొడాలి నాని విమర్శించారు. భవిష్యత్ లో కూడా డిపాజిట్లు రావని జోస్యం చెప్పారు. సీఎం జగన్ చీల్చి చెండాడుతారంటూ హెచ్చరించారు. డ్రగ్స్ అఫ్గనిస్థాన్ నుంచి తాడేపల్లికి లింక్ ఉన్నాయని చంద్రబాబు అంటున్నారన్న ఆయన.. ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేశారని ఆరోపించారు. ట్యాక్స్ లు ఎగొట్టి హెరిటేజ్ లో డబ్బులు పెట్టారని నాని ఆరోపించారు. చంద్రబాబు రెండు వేల కోట్లకు ఎలా ఎదిగారో ఎన్టీఆర్ చెప్పారని మంత్రి అన్నారు. 


Also Read: హైకోర్టు తీర్పు చాలా బాధాకరం... రాజ్యాంగబద్ధంగానే ఇళ్ల పథకం అమలు.... తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని మంత్రులు బొత్స, సుచరిత స్పష్టం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి