పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరమని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. విజయనగరంలో మాట్లాడిన ఆయన ఇళ్ల పథకంపై ప్రభుత్వ వివరణ తీసుకోకుండానే తీర్పు ఇవ్వడం బాధాకరమన్నారు. నవరత్నాలు కింద పేదలందరికీ ఇళ్ల పథకంపై శుక్రవారం ఏపీ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. సెంటు, సెంటున్నర స్థలంపై ఇళ్ల నిర్మాణం సరికాదని, ఇళ్ల నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై మంత్రులు బొత్స, సుచరిత స్పందించారు. ప్రతి మహిళ ఇంటి యజమానిగా ఉండాలనే ఇళ్ల పథకం తీసుకొచ్చామని మంత్రి బొత్స అన్నారు. కోర్టు తీర్పులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదన్న ఆయన... కేంద్ర విధివిధానాలతోనే ఇళ్ల పథకం చేపట్టామని తెలిపారు. 


Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..


రాజ్యాంగ బద్ధంగానే సంక్షేమ కార్యక్రమాలు: బొత్స


పేదలందరికీ ఇళ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యాంగబద్ధంగానే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని బొత్స అన్నారు. ఇళ్ల నిర్మాణానికి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై కమిటీతో అధ్యయనం చేయించాలని హైకోర్టు సూచించింది. అప్పటి వరకూ ఇళ్ల నిర్మాణాలను చేపట్టవద్దని ధర్మాసనం తీర్పు వెలువరించింది. 


Also Read: 12 శాతం వడ్డీ - 4 వారాల గడువు.. బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశం !


సెంటు భూమిలో రెండు గదులు నిర్మించుకోవచ్చు: సుచరిత


పేదల ఇళ్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తుందని హోంమంత్రి సుచరిత తెలిపారు. గత ప్రభుత్వాలు పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారని ఆమె అన్నారు. ఇరుకు గదుల్లో ఉంటూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై వంకలు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లా కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో ఆసరా చెక్కులను సుచరిత పంపిణీ చేశారు. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే ప్రతిపక్షాలు న్యాయస్థానాలను ఆశ్రయించి అడ్డుకుంటున్నాయన్నారు.  ఒకే గదిలో ఉంటూ ఎంతోమంది పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెంటు భూమిలో రెండు గదులు నిర్మించుకోవచ్చని మంత్రి అన్నారు. ప్రభుత్వ భూమి లేని ప్రాంతంలోనూ ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి పేదలకు ఇస్తుందన్నారు.


Also Read: పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక తీర్పు... నిర్మాణాలు ఆపాలని కీలక ఆదేశాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి