రైల్వే శాఖ ఓ వినూత్న ఆలోచన చేసింది. ఏసీ కోచ్‌లలో చాక్లెట్లు సహా ఇతర ఆహార పదార్థాలను తరలిస్తోంది. వీటికి అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావాలి. సౌత్ వెస్ట్రన్ రైల్వే, హుబ్బళి డివిజన్ ఈ కార్యక్రమం చేపట్టింది.
అక్టోబర్ 8న 163 టన్నుల చాక్లెట్లు, నూడిల్స్‌ను వాస్కోడిగామా రైల్లోని 18 ఏసీ కోచ్‌లలో గోవా నుంచి దిల్లీలోని ఓఖ్లాకు ఈ రైలు బయలుదేరింది.
ఈ రైలు మొత్తం 2115 కిమీ ప్రయాణించి దిల్లీ చేరుకుంది. దీని ద్వారా దాదాపు రూ.12.83 లక్షల రెవెన్యూ రాబట్టింది రైల్వేశాఖ. సాధారణంగా వీటిని రోడ్డు రవాణా చేస్తుంటారు. అయితే వినూత్నంగా మొదటిసారి రైల్లో చేశారు.
వినియోగదారులకు, పరిశ్రమలకు వేగంగా, సురక్షితంగా వస్తువలను చేరవేసేందుకు రైల్వేశాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు కొనియాడుతున్నారు. ఇప్పటికే హబ్బళీ డివిజన్.. పార్సిళ్లలో నెలకు కోటికి పైనే రెవెన్యూ రాబడుతుంది. 2021 సెప్టెంబర్‌కు గాను ఈ డివిజన్ రెవెన్యూ రూ.1.58 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11.17 కోట్ల రెవెన్యూ వచ్చింది.
రైల్వేశాఖ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. రోడ్డు రవాణాతో పోలిస్తే రైల్వేలో తరలించడం ద్వారా వస్తువలు మరింత వేగంగా వస్తాయంటున్నారు. అంతేకాకుండా చాక్లెట్లు, నూడిల్స్ వంటి వస్తువులకు కావాల్సిన శీతల వాతావరణం ఏసీ కోచ్‌లలో లభ్యమవుతుందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు.
Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం
Also read: మగవారిని ఆ క్యాన్సర్ నుంచి కాపాడే దివ్యౌషధం దానిమ్మ... తినమని చెబుతున్న హార్వర్డ్ వైద్యులు
Also read: మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం... అధిక ఆలోచనలతోనే ముప్పు
Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి