తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే జనసేన పార్టీని ఏర్పాటు చేశామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని పవన్ అన్నారు. కొత్త తరం రాజకీయాల్లోకి రావడానికి జనసేన ఉపయోగిపడుతోందన్నారు. మార్పు కోసం దెబ్బలు తినటానికైనా సిద్ధమని పవన్ అన్నారు. దెబ్బలు తింటూనే ఏపీలో పంచాయతీలు, ఎంపీటీసీలను జనసేన గెలిచింది. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


Also Read: తాకట్టులో ఆంధ్రప్రదేశ్... జీతాలు, ఫించన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి... ఏపీ సర్కార్ పై పవన్ ట్వీట్ వార్






అన్ని కులాలకు ప్రాధాన్యత


తెలంగాణ పోరాట స్ఫూర్తితో పార్టీ స్థాపించానని పవన్ కల్యాణ్ తెలిపారు. జై తెలంగాణ అంటూ పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాజకీయాల్లోకి రావడం రిస్క్ అన్నారని, ఎందుకు రిస్క్ అని పవన్ ప్రశ్నించారు. సామాజిక మార్పుకోసం పోరాడతామన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పవన్ అన్నారు. అడుగు పడితే తప్ప అనుభవం రాదని పవన్ అన్నారు. సమాజమే తనకు పాఠాలు నేర్పిందన్నారు. కులం అనేది సామాజిక సత్యమన్న పవన్... సామాజిక రుగ్మతను తొలగించే దిశగా అడుగువేయాలన్నారు. జనసేన పార్టీలో అన్ని కులాలకు ప్రాధాన్యత ఉంటుందని పవన్ తెలిపారు. 


Also Read: హైదరాబాద్ ఫార్మా కంపెనీలో రూ. 550 కోట్ల లెక్క చూపని ఆదాయం ! ఐటీ శాఖ కీలక ప్రకటన ! 


పోరాట స్ఫూర్తి తెలంగాణ సొంతం


భాషలను గౌరవించే సంప్రదాయాన్ని జనసేన పార్టీ కచ్చితంగా పాటిస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు. మన భాషని యాసని తాను గౌరవిస్తున్నట్లు తెలిపారు. సంస్కృతిని కాపాడే విధంగా తాము నడుచుకుంటామన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రాంతీయ వాదాన్ని అగౌరవ పరిస్తే చాలా మంది బాధపడ్డారని పవన్ గుర్తుచేశారు. ప్రాంతీయ వాదాన్ని గౌరవిస్తూనే దేశాన్ని ప్రేమించాలని సూచించారు. వ్యక్తులను వర్గశత్రులుగా భావించానన్న పవన్ కల్యాణ్... సమాజంలో ఉన్న సమస్యలే వర్గ శత్రువులన్నారు. తెలంగాణ గొప్పదనం ఏమిటంటే పదిహేడేళ్ల కుర్రాడు సైతం సమస్యపై పోరాడతారని పవన్ తెలిపారు. ఖమ్మం జిల్లాలోని నల్లమల్ల సమస్య కోసం తన వద్దకు వచ్చిన కుర్రాడి తీరు ఎప్పటికీ మరచిపోనని తెలిపారు. గొప్ప పోరాట స్ఫూర్తి తెలంగాణ సొంతమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 


Also Read: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం... చిగురుటాకులా వణికిన భాగ్యనగరం.. జీహెచ్ఎంసీ అలర్ట్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి