గతంలో ఎప్పుడూలేనంత ఉత్కంఠ తొలిసారి ‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో నెలకొంది. విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్లలో ఏది గెలుస్తుందో అన్న ఆసక్తి సినీ ప్రియుల్లో ఎక్కువైంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మద్దతిస్తున్న రాజశేఖర్ తాను కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నానని తెలిపాడు. అసోసియేషన్ అధ్యక్ష పీఠం అనేది పెత్తనం చేసేందుకు కాదని, అది ఒక బాధ్యతని చెప్పుకొచ్చారు రాజశేఖర్.  పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటీనటులు ఉన్నారని, ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సొంతం చేసుకోవాలని అన్నారు. అందుకు మా అసోసియేషన్ తగిన అధ్యక్షుడు కావాలని అన్నారు. అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ గెలిస్తే అసోసియేషన్ ఎంతో అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్టు అన్నారు.  అసోసియేషన్లోని సభ్యుల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తినే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కోరారు. 


తనకు కూడా ‘మా’అధ్యక్షుడిగా పోటీ చేయాలనే ఆలోచన ఉండేదని అన్నారు రాజశేఖర్.  అలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ తన ఇంటికి వచ్చి... మా అసోసియేషన్ సంక్షేమం కోసం ఏమేం చేయాలనుకుంటున్నారో వివరించారని, అది విన్నాక తాను మనసు మార్చుకున్నట్టు చెప్పారు రాజశేఖర్. తన కన్నా ప్రకాష్ రాజ్ అధ్యక్షుడు అవ్వడమే మంచిదనిపించిందని, అందుకే తాను పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నానని తెలిపారు. అసోసియేషన్  అభివృద్ధి చేయాలంటే చాలా డబ్బు అవసరమని, అందుకోసం చాలా ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ నిర్వహించాలని అన్నారు. ప్రకాష్ రాజ్ కు వివిధ భాషా ఇండస్ట్రీలతో మంచి సంబంధాలున్నాయి కనుక ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అతను చక్కగా నిర్వహించగలడని అన్నారు రాజశేఖర్. అందుకే తాను అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్టు తెలిపారు. అలాగే ప్రకాష్ రాజ్ కు కూడా తన మద్దతును తెలిపినట్టు చెప్పాడు. 


తేలేది ఆ రోజే
మా ఎన్నికల ప్రక్రియలో స్వల్ప మార్పులు జరిగాయి. అక్టోబర్ 10 ఆదివారం పోలింగ్ జరుగుతుండగా, అక్టోబర్ 11 సోమవారం ఫలితాలను విడుదల చేయనున్నారు. ముందు మాత్రం ఆదివారమే పోలింగ్ నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు. ఈ విషయంలో కాస్త మార్పులు జరిగాయి. అధ్యక్షడయ్యేదో ఎవరో అక్టోబర్ 11, సోమవారం తేలిపోనుంది. 


Also read: మొన్న రకుల్, నేడు మంచు లక్ష్మి... సమంతకు పెరుగుతున్న మద్దతు


Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోకండి.. గుండె ఆరోగ్యాన్ని చెప్పేస్తాయివి


Also read: సోనూసూద్ సిమ్ కార్డు... 10జి నెట్ వర్క్, అంతా ఉచితమే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి