హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రముఖ ఫార్మా కంపెనీల్లో జరిపిన సోదాల్లో లెక్కల్లో చూపని  కోట్లు ఆదాయం గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ.142.87కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.  మొత్తం 16 బ్యాంకు లాకర్లు గుర్తించారు. ఆరు రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా తెలిపింది .


Also Read : ఎయిర్‌ ఇండియాకు లాభాలు సులువేం కాదు! టాటా సన్స్‌ ముందు కఠిన సవాళ్లు


సంస్థకు సంబంధించిన ప్రదేశాల్లోని పలు రహస్య స్థావరాల్లో లెక్కలకు సంబంధించిన పుస్తకాలు, నగదు, ఖాతాలు, నగదుకు సంబంధించిన రెండవ సెట్ పుస్తకాలు కనుగొన్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. డిజిటల్ మీడియా, పెన్ డ్రైవ్‌లు, డాక్యుమెంట్ల రూపంలో నేరపూరితమైన సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఐటీ శాఖ ప్రకటించింది. , ఉనికిలో లేని సంస్థల నుంచి చేసిన కొనుగోళ్లలో తేడాలు వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయని.. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ కంటే తక్కువగా కొనుగోలు చేసిన భూముల వివరాలు ఇతర అనేక విషయాలు బయటపడినట్లు ప్రకటించింది. ఈ సంస్థ యూరప్‌, అమెరికాకు డ్రగ్స్‌ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నట్లు  ఐటీ శాఖ తెలిపింది. 


Also Read : మీరు ఫోను కొంటే మేం డబ్బులిస్తాం.. ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌.. షరతులు వర్తిస్తాయి!


సంస్థ పేరును ఆదాయపు పన్ను శాఖ వెల్లడించలేదు. ఎప్పుడు సోదాలు చేసినా ఆదాయపు పన్నుశాఖ ఎంతెంత నగదు దొరికిందో వివరిస్తుంది కానీ... ఎప్పుడూ సంస్థ పేరు చెప్పదు. ఇప్పుడు కూడా చెప్పలేదు. అయితే హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా ప్రముఖ ఫార్మా కంపెనీ హెటెరోలో సోదాలు జరుగుతున్నాయి. ఆ సంస్థ కార్పొరేట్ కార్యాలయంతో పాటు డైరక్టర్లు, సంస్థకు సంబంధించిన ఉన్నాతాధికారులు, ప్లాంట్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న విషయం వెల్లడయింది. 


Also Read : ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆ లావాదేవీల పరిమితి పెంపు!


ఇప్పుడు ఆదాయపు పన్నుశాఖ హెటెరోలో చేసిన సోదాల గురించే ప్రకటించినట్లుగా భావింవచ్చు. హెటెరో సంస్థ పెద్ద ఎత్తున కరోనా మెడిసిన్స్‌ను అమ్మింది. ముఖ్యంగా రెమిడెసివర్ వంటి యాంటీ వైరల్ డ్రగ్స్‌ను పెద్ద ఎత్తున అమ్మింది. అయితే సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో ఈ మెడిసిన్స్ ఎక్కువగా బ్లాక్ మార్కెట్ అయ్యాయి. ఈ క్రమంలో ఐటీ దాడులు జరగడం.. పెద్ద ఎత్తున నగదు దొరకడం సంచలనంగా మారింది. 


Also Read: ఇంటర్‌నెట్ లేకున్నా పేమెంట్ చేయవచ్చు.. త్వరలో ఆఫ్‌లైన్ చెల్లింపుల విధానం..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి