భారతీయ రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. వినియోగదారల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.


నగదును తక్షణమే ట్రాన్స్‌ఫర్ చేసేందుకు డిజిటల్ పేమెంట్‌ విధానానన్ని ఎక్కువ మంది వినియోగిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసేందుకే ఈ పరిమితిని పెంచినట్లు వెల్లడించారు.





డిజిటల్ లావాదేవీలను మరింత పెంచేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. ఆర్‌టీజీఎస్ లావాదేవీలను 24X7 అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ విధానంలో రిటైల్‌ డిజిటల్‌ పేమెంట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించినట్లు వెల్లడించారు. 2021 ఆగస్టు 1 నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హోస్ (ఎన్‌ఏసీహెచ్)ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ విధాననం ద్వారా పేమెంట్ ఆఫ్ డివిడెండ్, వడ్డీ, జీతాలు, పింఛను వంటి లావాదేవీలు జరపొచ్చు.


కీలక వడ్డీరేట్లు యథాతథం..










ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోరేటు 4 శాతంగా, రివర్స్‌ రెపోరేటు 3.35 శాతంగా కొనసాగనున్నాయి. ఇలా వడ్డీరేట్లను మార్చకపోవడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ ఆర్‌బీఐ మరోసారి ఇలానే నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 6న ప్రారంభమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను శుక్రవారం గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.


Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి