యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET- నెట్) పరీక్ష తేదీలు మరోసారి మారాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ 2021 పరీక్షలు అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. డిసెంబర్ 2020, జూన్ 2021 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఒకసారి వాయిదా పడగా.. ఇది రెండో సారి. ప్రారంభంలో ఎన్టీఏ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ పరీక్షలు అక్టోబర్‌ 6 నుంచి 11వ తేదీ వరకు జరగాల్సి ఉంది. ఈ తేదీల్లో ఇతర ముఖ్యమైన పరీక్షలు ఉండటంతో విద్యార్థులకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండటంతో తేదీలను సవరించింది. అక్టోబర్ 17 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం ugcnet.nta.nic.in, www.nta.ac.in వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు.



తాజాగా కోవిడ్ 19 సహా ఇతర కారణాల వల్ల యూజీసీ నెట్ పరీక్షలను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పింది. యూజీసీ నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు యూజీసీకి అనుబంధంగా ఉన్న కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అర్హత సాధిస్తారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో పనిచేయాలంటే ఈ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ఇందులో అర్హత సాధించిన వారికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ చేసే అవకాశం దక్కుతుంది. 


Also Read: నేటితో ముగియనున్న నీట్ యూజీ సవరణలు.. ఇవి చేయడం మర్చిపోకండి..


ఇప్పటికే పలుమార్లు వాయిదా.. 
కోవిడ్ 19 తీవ్రత కారణంగా యూజీసీ నెట్ పరీక్షలు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డాయి. గతేడాది జరగాల్సిన యూజీసీ నెట్ డిసెంబర్ 2020తో పాటు ఈ ఏడాది నిర్వహించాల్సిన జూన్ 2021 షెడ్యూల్ (డిసెంబర్ 2020- జూన్ 2021) సైతం వాయిదా పడింది. యూజీసీ అంగీకారంతో ఈ 2 సెషన్లను విలీనం చేసి ఒకటిగా నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. 


Also Read: ఏపీ నిట్‌లో ఎంబీఏ కోర్సు.. అక్టోబర్ 30తో ముగియనున్న దరఖాస్తు గడువు.. ముఖ్యమైన వివరాలివే..


యూజీసీ నెట్ వాయిదాపై ఫన్నీ మీమ్స్
యూజీసీ నెట్ పరీక్ష హాల్ టికెట్ల డౌన్ లోడ్ కోసం ప్రయత్నించిన విద్యార్థులకు పరీక్ష వాయిదా నోటిఫికేషన్ కనిపించింది. గత కొన్ని నెలలుగా ఇదే విషయం జరుగుతుండటంతో విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు.









Also Read: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాల‌ర్‌షిప్‌.. ఏడాదికి రూ.38,500 సాయం..


Also Read: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్.. ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలివే.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి