ఒకవేళ మీరు కొత్త ఫోన్ కొనాలనుకుంటే ప్రస్తుతం అమెజాన్‌లో ఆఫర్ల వర్షం కురుస్తుంది. వీటిపై డిస్కౌంట్లతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందించారు. ఈ పండగ సీజన్‌లో వినియోగదారులను ఆకట్టుకోవడానికి స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లను కూడా అమెజాన్ అందిస్తోంది. రూ.30 వేలలోపు అందుబాటులో ఉన్న 5జీ ఫోన్లలో బెస్ట్ ఇవే..


అమెజాన్ నవరాత్రి ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


1. ఎంఐ 11ఎక్స్ 5జీ
ఈ ఫోన్‌పై ప్రస్తుతం అమెజాన్‌లో భారీ ఆఫర్ నడుస్తోంది. రూ.33,999 విలువైన ఈ ఫోన్ రూ.26,999కే కొనుగోలు చేయవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4520 ఎంఏహెచ్‌గా ఉంది.


ఎంఐ 11ఎక్స్ 5జీ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


2. ఐకూ జెడ్5 5జీ
ఈ ఫోన్ అసలు ధర రూ.29,990 కాగా, ఈ సేల్‌లో రూ.23,990కే కొనుగోలు చేయవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 44W ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీని అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్‌గా ఉంది.


ఐకూ జెడ్5 5జీ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


3. వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ
ఈ ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.29,999కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఏఐ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది.


వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


4. శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ
శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ కూడా ట్రెండింగ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ అసలు ధర రూ.34,999 కాగా, ఈ సేల్‌లో రూ.25,999కే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇందులో అందించారు.


శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి