Bonalu in Hyderabad 2024:  ప్రకృతితో మనిషికి విడదీయలేని బంధం ఉంది. పంచభూతాలతో నిర్మితమైన ఈ శరరాన్ని నడిపించేది మానవాతీతశక్తి అని విశ్విసిస్తుంటారు. అందుకే పుట్టుక, జీవనం, మరణం అన్నీ చిత్రవిచిత్రాలే. వాటి వెనుక ఎన్ని శాస్త్రీయకారణాలున్నా కానీ అంతుచిక్కని సందేహాలు ఇంకా మిగిలేఉండిపోతాయి. ఇందులో భాగంగా ప్రకృతిశక్తికి ప్రతిరూపంగా అమ్మను పూజించే పర్వదినమే బోనాలు. జూలై 6న ఆషాడమాసం మొదలవుతోంది.. జూలై 7 న ఆదివారం బోనాలు ప్రారంభమవుతోంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగ వెనుక ఆధ్యాత్మిక కారణాలకన్నా అంతకుమించిన ఆరోగ్య రహస్యాలున్నాయి.


Also Read: ఆషాఢ అమావాస్య రోజు ఈ ఒక్కటీ చేస్తే మీ కుటుంబానికి ఉన్న పితృదోషం తొలగిపోతుంది!
 
బోనాల వెనుకున్న ఆరోగ్య రహస్యం


కొత్త కుండకి సగం వరకూ సున్నం పూసి, పై భాగానికి నూనె పూసి  పసుపు, కుంకుమ అద్దుతారు..చందనం చల్లుతారు. ఘటాన్ని అన్నంతో నింపి దాని చుట్టూ మామిడాకులు, వేపరెమ్మల దండ కడతారు. ఘటంపై దీపం వెలిగించేందుకు వీలుగా మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించి చుట్టుపక్కల అందరితో కలసి వెళ్లి బోనం సమర్పిస్తారు.  ఆషాడం అంటే వర్షాకాలం మొదలు... ఊరూ వాడా చిన్న చిన్న గుంటలు కూడా నీటితో నిండిపోయి ఉంటాయి. విష జ్వరాలు , అంటు వ్యాధులు విజృంభించే సమయం.   వైరస్ ద్వారా అంటు వ్యాధులు వ్యాపిస్తాయి.  వైద్యవిజ్ఞాన శాస్త్రం పరిణతి చెందని కాలంలో పల్లెటూర్లలో ప్లేగు, కలరా, మశూచి లాంటి అంటువ్యాధుల బారిన ప్రజలు ప్రజలు పిట్టల్లా రాలిపోయేవారు. దాన్నే గత్తర వచ్చింది అనేవారు. ఈ వైపరీత్యాలనుంచి కాపాడాలంటూ అమ్మను ఆరాధిస్తారు..ఈ ఆరాధనకోసం వినియోగించే వస్తువులన్నీ వైరస్ ను నిర్మూలించేవే. ఊరూ వాడా శుభ్రం చేయడం ద్వారా సగం సూక్ష్మక్రిములను తరిమికొడితే... వేపాకులు, పసుపు నీళ్లు వినియోగంతో అంటువ్యాధులను నిర్మూలించే ప్రయత్నం చేస్తారు.  ప్రతి లోగిలి ముందు కళ్లాపి చల్లడం, ముగ్గులు వేయడం, వేపాకులు, పసుపుతో సూక్ష్మ క్రిములు దూరమవుతాయి.  బోనం కుండలో అన్నం, ఉల్లిగడ్డ, మిరియాలు, పరమాన్నం ఉంచి..ఆపైన మూతపెట్టి నూనెపోసి దీపం వెలిగిస్తారు, మొదట ఇంట్లో దేవుడి దగ్గరుంచి ఆ తర్వాత ఆలయానికి వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. వంశం అభివృద్ధి చెంది కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సాక పోస్తారు. మశూచి లాంటి అనారోగ్యాలు రాకుండా ఇది కాపాడుతుందంటారు. 


Also Read: ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసోత్సవాలు ..నెలరోజుల పాటూ దుర్గమ్మ సన్నిధిలో పండుగ వాతావరణమే!


వేపాకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


చేదుగా ఉండే వేపాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆ గాలి తగిలినా కానీ ఆరోగ్యమే...అందుకే అంటువ్యాధులు ప్రబలే ఆషాడం ఆరంభంలో బోనాల జాతరలో ఎక్కడచూసినా వేపాకులు కనిపిస్తాయి. వేపాకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పరగడపునే వేపాకులు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది ,కడుపులో అల్సర్లు మాయమవుతాయి...గ్యాస్, కంటికి సంబంధించిన రుగ్మతలు తొలగిపోతాయి, గుండె రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు..ఎన్నో చర్మవ్యాధులకు కూడా వేప దివ్యఔషధంలా పనిచేస్తుంది. మొటిమలు, చర్మరోగాలకు చక్కని మందు వేప.  


Also Read:  ఆషాడం వచ్చేస్తోంది..ఇక కొత్త దంపతులు జరగండి జరగండి - అసలు ఎందుకీ నియమం!


పసుపుని మించిన దివ్య ఔషధం లేదు


ఇక పసుపు విషయానికొస్తే ఆయుర్వేద ఔషధాల్లో ప్రధానమైది ఇదే. పసుపు వినియోగం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటారు  ఆయుర్వేద నిపుణులు. క్యాన్సర్ ని నిరోధించడంలో పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుందని న్యూట్రియంట్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పేర్కొన్నారు.  ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దప్రేగు క్యాన్సర్లకు వ్యతిరేకంగా పసుపు పనిచేస్తుందని ఆ అధ్యయనంలో తేలింది. పసుపు ఎక్కువగా వినియోగించడం వల్ల కీమోథెరఫీ మెరుగ్గా పనిచేస్తుందని కూడా పరిశోధకులు పేర్కొన్నారు. డిప్రెషన్ తగ్గిస్తుంది, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది...ఇంకా ఇన్ఫెక్షన్‌లు, గాయాలు ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌ లేదా టాక్సిన్స్‌ వల్ల మ వాటి వల్ల వచ్చే మంటను పసుపు   తగ్గిస్తుంది. 


Also Read: దాన వీర శూర 'కర్ణుడు' నిజంగా హీరోనేనా? విలన్ ని చేశారా..భీష్ముడు ఏం చెప్పాడంటే!


Disclaimer:  ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం .