TGEAPCET 2024 WEB COUNSELLING: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు తొలివిడత ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి (జులై 4న) ప్రారంభం కానుంది. విద్యార్థులు జులై 4 నుంచి 12 నిర్ణీత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. వీరికి జులై 6 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా 36 సహాయక కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారు జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వీరికి జులై 19న మొదటి దశ ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు జులై 19 నుంచి 23 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని ఎప్‌సెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. 


ప్రవేశాలు కల్పించే ఇంజినీరింగ్ కోర్సులు: బీఈ/ బీటెక్‌, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (బయో-టెక్నాలజీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (ఎంపీసీ), ఫార్మ్-డి (ఎంపీసీ).


ప్రవేశాలు కల్పించే అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సులు: బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ(ఫారెస్ట్రీ), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌,  బీఎఫ్‌ఎస్సీ, బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (బైపీసీ), ఫార్మ్-డి (బైపీసీ).


తొలిదశ కౌన్సెలింగ్ షెడ్యూలు..


➥ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌: 04-07-2024 నుంచి 12-07-2024 వరకు.


➥ ధ్రువపత్రాల పరిశీలన: 06-07-2024 నుంచి 13-07-2024 వరకు.


➥ ఆప్షన్ల ఎంపిక: 08-07-2024 నుంచి 15-07-2024 వరకు.


➥ ఆప్షన్ల ఫ్రీజింగ్‌: 15-07-2024.


➥ సీట్ల కేటాయింపు: 19-07-2024


➥ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: 19-07-2024 నుంచి 23-07-2024 వరకు.


Counselling Notification


Counselling Website


తెలంగాణ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు..


ధ్రువపత్రాల పరిశీలనకు ఈ సర్టిఫికేట్లు అవసరం..


➥ TGEAPCET-2024 ర్యాంకు కార్డు


➥ TGEAPCET-2024 హాల్‌టికెట్


➥ ఆధార్ కార్డు


➥ పదోతరగతి లేదా తత్సమాన మార్కుల మెమో 


➥ ఇంటర్ లేదా తత్సమాన మార్కుల మెమో కమ్ పాస్ సర్టిఫికేట్ 


➥ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీసర్టిఫికేట్లు 


➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (T.C).


➥ ఇన్‌కమ్ సర్టిఫికేట్ (01-01-2024 తర్వాత జారీచేసింది) 


➥ EWS ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ (2024-25) 


➥ క్యాస్ట్ సర్టిఫికేట్ 


➥ రెసిడెన్స్ సర్టిఫికేట్ 


➥ ఎంప్లాయర్ సర్టిఫికేట్ (ప్రభుత్వ ఉద్యోగులైతే)


➥ మైనార్టీ స్టేటస్ సర్టిఫికేట్


➥ స్పెషల్ కేటగిరీ అభ్యర్థులైతే PHC సర్టిఫికేట్, CAP సర్టిఫికేట్, NCC సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ 


తెలంగాణలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు మే 7 నుంచి 11 వరకు టీజీ ఈఏపీసెట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష్లలకు సంబంధించిన ఫలితాలను మే 18న అధికారులు విడుదల చేశారు. ఎప్‌సెట్ ఫలితాలకు సంబంధించి ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 74.98 శాతం, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 89.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మసీ కోర్సుల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు 91,633 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణ‌త సాధించారు.


ఈ కౌన్సెలింగ్‌ ద్వారా బీఈ/ బీటెక్‌/ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులు ఈఏపీసెట్‌ 2024తో పాటు ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ సబ్జెక్టులు జనరల్‌ 45%, ఇతరులు 40% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. తొలిదశ జులై 4 నుంచి 23 వరకు, రెండోదశ జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు, తుదిదశ ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగనుంది.


హైదరాబాద్‌లో టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీలు ఇవే..
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 4 నుంచి 23 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో  ఏ కళాశాలలో చేరితే బాగుంటుందనే డైలమా ఇటు పేరెంట్స్‌లోనూ, అటు విద్యార్థుల్లోనూ కనిపిస్తుంటుంది. అయితే వీరిందరి మొదటి ఛాయిస్ హైదరాబాద్‌లోని కాలేజీలే అనడంతో సందేహంలేదు.  విద్యార్థులు ముందుగానే హైదరాబాద్‌లో టాప్ 10 ఉత్తమ ఇంజినీరింగ్ కాలేజీల గురించి తెలుసుకుంటే వెబ్ ఆప్షన్ల సమయంలో కాలేజీలను ఎంచుకోవటానికి అనువుగా ఉంటుంది.  విద్యార్థులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ లోని టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీల వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..