Ashadha Amavasya Date 2024: ఆషాఢ అమావాస్య రోజు ఈ ఒక్కటీ చేస్తే మీ కుటుంబానికి ఉన్న పితృదోషం తొలగిపోతుంది!

Ashadha Amavasya Date 2024: ఆషాఢ అమావాస్యను భీమ అమావాస్య అని కూడా అంటారు. ఈ ఏడాది ఆషాడమాసం జూలై 6 న ప్రారంభం అవుతోంది.. ఆగష్టు 4న అమావాస్య వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం..

Continues below advertisement

Ashadha Amavasya 2024: ఆషాడ అమావాస్య, భీమ అమావాస్య, జ్యోతిర్భీమేశ్వర అమావాస్య ...ఎలా పిలిచినా ఒకటే. ఈ ఏడాది ఆషాఢ అమావాస్య ఆగష్టు 4 ఆదివారం వచ్చింది. ఆషాడమాసం, ఆదివారం అత్యంత పవర్ ఫుల్ అని చెబుతారు పండితులు. 

Continues below advertisement

ఆషాఢ అమావాస్య  ప్రాముఖ్యత 

హిందూ మతగ్రంధాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజు పితృ తర్పణాలిస్తారు. ఇలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని తద్వారా వంశ వృద్ధి జరుగుతుందని పండితులు చెబుతారు. ఈ రోజు పవిత్ర స్థలాలను సందర్శించి..నదీ స్నానం ఆచరించి పిండప్రదానాలు చేస్తారు.  ఈ రోజు పెద్దల పేరుతో  చేసే దాన , ధర్మాల వల్ల వారికి జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించి మోక్షం పొందుతారు.  

Also Read: ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసోత్సవాలు ..నెలరోజుల పాటూ దుర్గమ్మ సన్నిధిలో పండుగ వాతావరణమే!

ఆషాఢ అమావాస్య 2024  ఘడియలు ఇవే

ఆగష్టు 03 శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు అమావాస్య ఘడియలు ప్రారంభై... ఆగష్టు 04 ఆదివారం మధ్యాహ్నం  3 గంటల 54 నిముషాలవరకూ ఉన్నాయి. పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉన్న రోజే పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆగష్టు 04న ఆషాడ అమావాస్య వచ్చింది.  

ఆషాఢ అమావాస్య రోజు ఏం చేయాలి?

ఈ రోజు పవిత్ర నదుల్లో స్నానమాచరించాలి.  పితృపూజ చేసి, తర్పణాలు విడిచిపెట్టి..అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం (స్వయంపాకం అంటే బియ్యం, పప్పులు, కూరగాయలు...etc), వస్త్రదానం చేయాలి. అనంతరం పేదలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశీశ్సులు మీపై ఉంటాయి. ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉండేవారు..ఈ రోజు ఆలయాలకు వెళ్లి భగవంతుడికి నమస్కరించి...అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూలచెట్టుకింద ఆవనూనెతో దీపం వెలిగించాలి.  

Also Read:  ఆషాడం వచ్చేస్తోంది..ఇక కొత్త దంపతులు జరగండి జరగండి - అసలు ఎందుకీ నియమం!

ఆషాఢ అమావాస్య పూజా ఇలా చేసుకోండి

ఆషాఢ అమావాస్య రోజు..ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి. దానిపై శివపార్వతుల ఫొటో పెట్టి పూజ చేయండి. పరమేశ్వరుడికి ప్రీతికరమైన బిళ్వపత్రం...పార్వతీ దేవికి పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి. సుమంగళి ఉపయోగించే అన్ని వస్తువులను పార్వతీదేవి పూజకోసం వినియోగించవచ్చు. అమావాస్య ఘడియలు ముగిసిన తర్వాత ఆ సుమంగళి వస్తువులన్నీ ఎవరైనా ముత్తైదువును పిలిచి బొట్టుపెట్టి అందించండి. ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయంటారు పండితులు.
 
అమావాస్య రోజు ఇవి వద్దు

నూతన వస్త్రాలు, చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు

లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు
 
నూతన వ్యాపారం, ఉద్యోగం..నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైన రోజు కాదు

నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనొద్దు

కేవలం ఈ రోజు పితృదేవతలను పూజించి..దాన ధర్మాలు మాత్రమే చేయాలి...

Also Read: దాన వీర శూర 'కర్ణుడు' నిజంగా హీరోనేనా? విలన్ ని చేశారా..భీష్ముడు ఏం చెప్పాడంటే!

Disclaimer:  ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం .

Continues below advertisement
Sponsored Links by Taboola