APTET July 2024 Online Application: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల అర్హత పరీక్ష 'ఏపీటెట్ జులై-2024' నోటిఫికేషన్ జులై 1న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఏపీటెట్ ఫీజు చెల్లింపు ప్రక్రియ జులై 3న ప్రారంభంకాగా.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 4న ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 16 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి జులై 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పరీక్ష ఫీజు కింద అభ్యర్థులు ఒక్కో పేపరుకు (పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి) రూ.750 వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ నెంబర్లు: 9505619127, 9705655349, 8121947387, 8125046997 ద్వారా సంప్రదించవచ్చు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జులై 25 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఇక ఆగస్టు 5 నుంచి 20 వరకు ఏపీటెట్ (జులై) పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
AP TET 2024 Online Application
వివరాలు..
* ఏపీటెట్-జులై-2024 (AP TET 2024)
అర్హతలు..
🔰 పేపర్-1 ఎ (1 - 5వ తరగతులకు)
➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఏదైనా డిగ్రీతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఏదైనా డిగ్రీతోపాటు 50 శాతం మార్కులతో బ్యాచిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఎంఈడీ అర్హత ఉండాలి.
➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.
🔰 పేపర్-1 బి (1 - 5వ తరగతులు) స్పెషల్ స్కూల్స్
➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్ - ఏదైనా డిజెబిలిటీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఏడాది డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్ - ఏదైనా డిజెబిలిటీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ డిప్లొమా (కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ పీజీ డిప్లొమా (కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ డిప్లొమా (మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ జూనియర్ డిప్లొమా (టీచింగ్-డెఫ్) అర్హత ఉండాలి. (లేదా)
➥ ప్రైమరీ లెవల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు (విజువల్ ఇంపేర్‌మెంట్)
➥ డిప్లొమా (ఒకేషనల్ రిహాబిలిటేషన్-మెంటల్ రిహాబిలిటేషన్)/ డిప్లొమా (ఒకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్-మెంటల్ రిటార్డేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ డిప్లొమా (హియరింగ్ లాంగ్వేజ్ & స్పీచ్‌తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో RCI గుర్తింపు పొందిన ఏడాది కోర్సు కలిగి ఉండాలి. దీంతోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి.
🔰 పేపర్-2 ఎ (6 - 8వ తరగతులు)
మ్యాథమెటిక్స్-ఫిజికల్ సైన్స్/బయోలాజికల్ సైన్స్/ సోషల్ స్టడీస్/ లాంగ్వేజ్ టీచర్లు
➥ 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీతోపాటు బీఈడీ ఉండాలి. (లేదా)
➥ 45 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగి ఉండాలి. (లేదా)
➥ 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నాలుగేళ్ల బీఏ/బీఎస్సీ లేదా బీఏఈడీ/బీఎస్‌ఈఈడీ. (లేదా)
➥ 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఏడాది బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత కలిగి ఉండాలి. (లేదా)
➥ 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ-ఎంఈడీ అర్హత కలిగి ఉండాలి. (లేదా)
➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.
🔰 లాంగ్వేజ్ టీచర్స్..
లాంగ్వేజ్ టీచర్స్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ ఉండాలి. (లేదా) బ్యాచిలర్ ఆఫ్ ఒరియంటెల్ లాంగ్వేజ్ (లేదా) గ్రాడ్యేయే పీషన్ (లిటరేచర్) (లేదా) సంబంధిత లాంగ్వేజ్‌లో పీజీ డిగ్రీతోపాటు లాంగ్వేజ్ పండిట్ సర్టిఫికేట్/బీఈడీ(సంబంధిత లాంగ్వేజ్) కలిగి ఉండాలి.
🔰 పేపర్-2 బి (6 - 8వ తరగతులు) స్పెషల్ స్కూల్స్
➥ కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఈడీ(జనరల్)తోపాటు ఏడాది డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఈడీ(జనరల్)తోపాటు రెండేళ్ల డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఈడీ(జనరల్)తోపాటు రెండేళ్ల పీజీ డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్/ స్పెషల్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటార్డేషన్/మల్లిపుల్ డిజెబిలిటి-ఫిజికల్, న్యూరోలాజికల్/లోకోమోటర్ ఇంపేర్‌మెంట్ & సెరిబ్రల్ పాల్సీ) అర్హత ఉండాలి.
➥ సెకండరీ లెవల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు (విజువల్ ఇంపేర్‌మెంట్)/ సీనియర్ డిప్లొమా టీచింగ్(డెఫ్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఏ.బీఈడీ (విజువల్ ఇంపేర్‌మెంట్) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
పరీక్ష ఫీజు: ఒక్కో పేపరుకు (పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి) రూ.750 వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షల(ఏపీటెట్)ఆధారంగా.
పరీక్ష విధానం: ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు.
➥ పేపర్-1 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-1 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-2 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్/బయాలజీ/ఫిజిక్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-2 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, కేటగిరీ ఆఫ్ డిజెబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగోగి -60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.
పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 60 మార్కులు, బీసీలకు 50 మార్కులు, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులు-ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతం ఉంటే సరిపోతుంది.
ఏపీటెట్ జులై 2024 షెడ్యూలు..
➥ AP TET - జులై -2024 నోటిఫికేషన్ వెల్లడి: 02.07.2024.
➥ దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 03.07.2024 -16.07.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.07.2024 - 17.07.2024.
➥ ఆన్‌లైన్ మాక్ టెస్టులు అందుబాటులో: 16.07.2024 నుంచి.
➥ టెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 25.07.2024 నుంచి
➥ టెట్ పరీక్ష షెడ్యూలు: 05.08.2024 - 20.08.2024. {పేపర్-1(ఎ) & పేపర్-1(బి), పేపర్-2(ఎ) & పేపర్-2(బి)}
➥ టెట్ ప్రాథమిక 'కీ' విడుదల: 10.08.2024.
➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 11.08.2024 - 21.08.2024.
➥ టెట్ ఫైనల్ కీ: 25.08.2024.
➥ టెట్ ఫలితాల వెల్లడి: 30.08.2024.