Breaking News Live Telugu Updates: ఉప్పల్‌ డబుల్‌ సెంచరీ కొట్టిన శుభ్‌మన్‌! సచిన్‌ రికార్డు బ్రేక్‌!

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 18 Jan 2023 05:14 PM
ఉప్పల్‌ డబుల్‌ సెంచరీ కొట్టిన శుభ్‌మన్‌! సచిన్‌ రికార్డు బ్రేక్‌!

ఉప్పల్‌ వన్డేలో శుభ్‌మన్‌ గిల్‌ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు సచిన్ 175 స్కోరును బీట్‌ చేశాడు. వరుస సిక్సర్లతో డబుల్‌ సెంచరీ అందుకున్నాడు. అలాగే కివీస్ పై సచిన్ చేసిన 186 రికార్డును బ్రేక్ చేశాడు

ఇండియాలో సిక్సర్ల కింగ్ రోహిత్‌- సరి కొత్త రికార్డు సృష్టించిన హిట్‌మెన్‌

భారత్‌లో ఆడుతున్నప్పుడు అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరుమీద ఉండేది. వన్డే ఫార్మాట్‌లో భారత గడ్డపై రోహిత్, మహేంద్ర సింగ్ ధోనీలు 123 సిక్సర్లు కొట్టారు. ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ రెండు సిక్స్‌లు బాది కొత్త రికార్డు సృష్టించాడు. భారతదేశానికి కొత్త సిక్సర్ కింగ్ గా రోహిత్ మారాడు 

టీమిండియాకు ఓపెన్ల శుభారంభం- ధోనీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఓపెన్లు రోహిత్ శర్మ, గిల్‌ అద్భతమైన బ్యాటింగ్ చేస్తున్నారు. పది ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ధోనీ సిక్స్‌ల రికార్డును రోహిత్ శర్మ క్రాస్ చేశాడు. 

MLAs Pouching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వ అప్పీల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వ అప్పీల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

  • తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

  • లిఖిత పూర్వక వాదనలకు సమయం కోరిన దవే

  • ఈ నెల 30 వరకు సమర్పించాలని హైకోర్టు ఆదేశం

  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సింగిల్ బెంచ్ సీబీఐకి ఇవ్వడాన్ని సవాలు చేసిన ప్రభుత్వం

  • తీర్పు రీజర్వ్ చేసిన హైకోర్టు

Devineni Uma: విజయవాడ గొల్లపూడిలో ఉద్రిక్తత, నేలపై పడుకున్న దేవినేని ఉమ

  • విజయవాడ గొల్లపూడిలో ఉద్రిక్తత

  • గొల్లపూడి టీడీపీ ఆఫీస్ కు తాళాలు వేసిన అధికారులు

  • టీడీపీ ఆఫీసు లీజు వ్యవహారంలో అధికారుల జులుం

  • టీడీపీ ఆఫీసుకు తాళాలు వేయడంపై పార్టీ నేతల ఆగ్రహం

  • అధికారులు తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేతల నిరసన

  • ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకొని గొల్లపూడి వన్ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు

  • ప్రభుత్వం కళ్లు తెరిపించాలని అధికారులకు బుద్ధి రావాలని రోడ్డుపై పడుకొని రక్తదాన కార్యక్రమం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ

తొలి వన్డేలో టీమిండియాలో ఆడే జట్టు ఇదే

ఉప్పల్ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

భారత్- న్యూజిలాండ్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరో అరగంటలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఓవైపు శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ గెలిచి జోరుమీదున్న టీమిండియా జట్టు.. మరోవైపు పాకిస్థాన్ పై వన్డే సిరీస్ ను గెలుచుకుని ఉత్సాహంతో ఉన్నన్యూజిలాండ్ టీంలో పై చేయి ఎవరిదీ అనేది ఉత్కంఠగా మారింది. బలాబలాల పరంగా సమంగా ఉన్నప్పటికీ.. గత రికార్డులు భారత్ కే అనుకూలంగా ఉన్నాయి. వన్డేల్లో, టీ20ల్లోనూ కివీస్ పై టీమిండియాదే పైచేయి. మరి తొలి మ్యాచ్ గెలిచి సిరీస్ లో బోణీ ఎవరు చేస్తారో చూద్దాం.

Srisailam Hundi Counting: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.3,57,81,068 

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 57 లక్షల 81 వేల 068 రూపాయల నగదు రాబడిగా లభించింది. ఈ ఆదాయాన్ని గత 28 రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 103 గ్రాముల 200 మిల్లీ గ్రాముల బంగారు, 7 కేజీల 520 గ్రాముల వెండి లభించాయి. వీటితోపాటు యుఎస్ఏ డాలర్లు 243, యుఏఈ రీరమ్స్ 220, సింగపూర్ డాలర్లు 61, ఆస్ట్రేలియా డాలర్లు 175, కెనడా డార్లు 20, యూరో 150, ఇంగ్లాండ్ పౌండ్స్ 25 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో లవన్న పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు.

NTR District News: ఎన్టీఆర్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన

  • ఎన్టీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే నివాళులు

  • టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు నందిగామ వైసీపీ ఎమ్మెల్యే, నాయకుల నివాళులు

  • ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నందిగామ వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు

  • ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ రోడ్ లో ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు

  • తెలుగు వారి ఆత్మగౌరవాన్ని రాజకీయాల్లో, సినిమాలో ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్ ది: ఎమ్మెల్యే జగన్మోహన్ రావు

Balakrishna Comments: తెలంగాణలో టీడీపీకి పునర్‌వైభవం తెవాలి - బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావలసిన బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకొని పనిచేయాలని టీడీపీ కార్యకర్తలకు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ రసూల్ పురలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ నివాళి అర్పించారు. కాగడాను వెలిగించి అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి లేరని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం, ఆస్తిలో వాటాను కల్పించి ఆడపడుచుల అన్నగా నిలిచారని పేర్కొన్నారు. విప్లవాత్మక పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత నందమూరి తారకరామారావుదేనని అన్నారు. బడుగుబాలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించి వారి ఎదుగుదలకు పట్టుబడిన దేవుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు కూడా చెదరక, బెదరక, తలవంచకుండా ముందుకు సాగిన దీరోదాత్తముడు నందమూరి తారకరామారావని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడి తెలుగు వెలుగులు ప్రపంచానికి చాటిచెప్పిన తెలుగు తేజం ఎన్టీఆర్, చిత్రసీమలోనే కాదు రాజకీయాలలో కూడా ఎన్టీఆర్ కు ముందు ఎన్టీఆర్ కు తరువాత అనే చెప్పుకునే విధంగా పరిపాలనను అందించి ఆదర్శంగా నిలిచారని వెల్లడించారు.

Khammam: నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది! టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్ గా మారిన తర్వాత తొలి భారీ బహిరంగ సభ బుధవారం ఖమ్మంలో జరగనుంది. నలుగురు ముఖ్యమంత్రులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు సహా దాదాపు వెయ్యిమంది వీవీఐపీలు సభకు హాజరుకానున్నారు. జాతీయ స్థాయికి విస్తరించాలని సంకల్పం చెప్పుకొన్న నేపథ్యంలో సభ నిర్వహణను బీఆర్‌ఎస్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వామపక్ష ఉద్యమాలకు, తెలంగాణసాయుధ పోరాటానికి గుమ్మంగా నిలిచిన ఖమ్మాన్ని ఇందుకు వేదికగా ఎంచుకుంది. బీఆర్‌ఎస్ తోపాటు ఆమ్‌ ఆద్మీ, వామపక్షాల ఐక్యత సభలో ప్రతిఫలించనుంది. సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్‌, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, పినరయి విజయన్‌ హాజరు కానున్నారు. అలాగే, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా తదితరులు రానున్నారు. సభకు 20 వేల మంది వీఐపీలు, వెయ్యి మంది వీవీఐపీలు, బీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇస్తున్న ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ, జాతీయ పార్టీలు, సంఘాల నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, హాజరవనున్నారు.

Background

ప్రస్తుతం శ్రీలంకను ఆనుకొని ఓ ఉపరితల ఆవర్తన ప్రాంతం తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపలేకపోవడంతో వచ్చే 5 రోజులు ఎలాంటి వర్షాలు ఉండే అవకాశం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. పశ్చిమ గాలుల ప్రభావం బలపడుతుండడంతో పొడిగాలులు తమిళనాడు, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో అధికంగా ఉంటాయని చెప్పారు. కాబట్టి, ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని, కానీ తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా సాధారణంగా చలి ఉంటుందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.


ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు.


‘‘ఎప్పుడైనా చలి కాలం నుంచి ఎండా కాలం వెళ్లే కాలంలో కొన్ని వర్షాలు పడటం చాలా సహజం. గత పది సంవత్సరాల్లో ప్రతి సారి మనం జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో ఏదో ఒక నెలలో వర్షాలను చూశాము. ఈ సారి జనవరి చివరి వారంలో కొన్ని వర్షాలకు సంకేతాలు కనబడుతోంది. సాధారణంగా జనవరి చివరి వారానికి చలి తగ్గుముఖం పడుతూ మెల్లగా పగటి సమయంలో వేడి పెరుతుంది, అలాగే రాత్రి చల్లగా ఉంటుంది.


పశ్చిమ గాలుల ప్రభావం అంటే..
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘మనకు ఎలా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందో, అలాగే  హిమాలయాలు, మధ్య ఆసియా మీదుగా కూడ భూమిలోనే అల్పపీడనాలు ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ఇరాన్, ఇరాక్ లో ఉన్న ఎడారిలో ఏర్పడి హిమాలాయాలు, ఉత్తర భారత దేశం వైపుగా వెళ్తుంది. దీనినే మనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటాము. అంటే చిన్నగా పశ్చిమ గాలులు అని అనవచ్చు. ఇది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల వైపు ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైనా బలంగా ఏర్పడినప్పుడు మాత్రం భాగా ప్రభావం చూపుతుంది’’ అని వివరించారు.


ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. సోమవారం (జనవరి 16) నుంచి మూడు రోజుల పాటు మరో కోల్డ్‌ స్పెల్‌ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. వరుసగా కొన్ని రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే దీనిని ఓల్డ్‌ స్పెల్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 5 నుంచి 9 తేదీల మధ్య ఏర్పడిన కోల్డ్‌ స్పెల్‌లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో ఇంతటి తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి.


రానున్న 5 రోజుల్లో ఢిల్లీతోపాటు పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వదులుగా, పొరలుపొరలుగా ఉండే దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. జనవరి 18 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు చెప్పారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎల్లో నేడు కూడా అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. పశ్చిమ తెలంగాణ జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. సాధారణంగా 11 నుంచి 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.


హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 16 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 31.4 డిగ్రీలు, 16.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.