JC Prabhakar Reddy Comments on Perni Nani | అనంతపురం: ‘ఏపీ సీఎం చంద్రబాబు మంచితనంతో మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ సంగతి చూసేవాళ్లం. పేర్ని నానికి ఆడవాళ్లంటే గౌరవం కూడా ఉందా? మా మీద కేసులు పెట్టినప్పుడు పేర్ని నానికి మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకురాలేదా. తప్పు చేశావ్ కాబట్టే నీ మొహంలో రక్తం చుక్క లేదు’ అంటూ మాజీ మంత్రి పేర్ని నానిపై తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మీకు మాత్రమే కుటుంబాలు ఉన్నాయా?

నాపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడును కూడా ఇబ్బండి పెట్టారు. ఇప్పుడు పేదలకు ఇవ్వాల్సిన బియ్యంలో దొంగ వ్యవహారం చేస్తున్నాడు పేర్ని నాని. మీ నాన్న పిలిచినప్పుడు వెళ్లి చైర్మన్‌ను చేశాం. ఇంతకీ ఎలా పుట్టావు నువ్వు. ఇప్పుడు మీ తప్పుల మీద కేసులు పెడతాం. చంద్రబాబుగారు మీరు పర్యటనలకు వెళ్లండి. మీ మంచితనాన్ని వాళ్లు అర్థం చేసుకోవడం లేదు. కేసులు పెడితే నెలల్లో బయటకు వస్తారంటా. చంద్రబాబు మంచితనంతో మీరు ఈజీగా బయటకు వస్తున్నారు. ఈరోజు మీరు బయట తిరుగుతున్నారంటే చంద్రబాబు దయవల్లే. 

చంద్రబాబు దయవల్ల బయట తిరుగుతున్నారు..

చంద్రబాబు పాతకాలం మనిషి.
చంద్రబాబు మంచితనం వల్ల వైసీపీ నాయకులు బతికిపోతున్నారు. పేర్నినాని బ్యాటరీ లేని వ్యక్తి. పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు. సీఎం చంద్రబాబుగారు ఇలాంటి వాళ్లను వదిలిపెట్టవద్దండీ. ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వీపు విమానం మోత మోగుతుంది. అధికారంలో ఉంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. ఇప్పుడు మీ తప్పులపై కేసులు పెడితే కుటుంబం ఉంది, ఆడవాళ్లంటే గౌరవం అని డ్రామాలు ఆడతావా? నా ఫ్యామిలీ మీద కేసులు పెట్టినప్పుడు మేం ఎంత క్షోభ పడ్డాం. వైసీపీ నేతలు 5 నెలల్లోనే బయటకొస్తున్నారంటే అందుకు చంద్రబాబు మంచితనం కారణం. 

Also Read: Tirumala: తిరుమలలో మొదలైన న్యూ ఇయర్ సందడి..భక్తుల రద్దీ అస్సలు తగ్గడం లేదుగా!

వైసీపీ హయాంలో 12సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు

వైసీపీ హయాంలో 12 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అయినా సిగ్గులేకుండా ధర్నాలు చేస్తారా? చంద్రబాబు మంచితనంతో మీరు బతికిపోతున్నారు. మేం వైసీపీ నేతల్ని ఒక్కమాట అన్నామంటే, వెంటనే పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ వస్తుంది. ఏమబ్బా మనం అలా మాట్లాడకూడదని చంద్రబాబు అంటారు. అసెంబ్లీలో భువనమ్మ గురించి మాట్లాడినప్పుడు ఫ్యామీలి విలువలు ఏమయ్యాయి. మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేతల్ని వదిలేది లేదు. పవన్ కళ్యాణ్ ను ఎన్ని మాటలు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్క సైగ చేస్తే మీరు ఎవరూ మిగలరు. గుడివాడ నేతలు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. అయిదేళ్లు మమ్మల్ని బయటకు రానివ్వలేదు. కానీ మీరు మాత్రం చంద్రబాబు మంచితనంతో నెలలకే బయటకు వచ్చేస్తున్నారు. అయినా ఆడవాళ్ల గురించి మాట్లాడినొళ్లని వదిలేది లేదు’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.