Breaking News Live Telugu Updates: లక్నోపై 12 పరుగులతో చెన్నై విజయం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఇరగదీసింది! ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో లక్నోపై 12 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.
జగిత్యాల జిల్లా : కొండగట్టు అంజన్న క్షేత్రంలో విషాదం., మాల విరమణ కు వచ్చి గుండెపోటుతో అంజన్న భక్తుడు మృతి.,
మృతి చెందిన భక్తుడు సిద్దిపేట జిల్లా కి చెందిన ఆర్టీసి డ్రైవర్ గా గుర్తింపు..
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ పొడిగించారు. రాహుల్ గాంధీకి ఏప్రిల్ 13 వరకు బెయిల్ పొడిగించింది సూరత్ సెషన్స్ కోర్టు. పరువు నష్టం కేసులో రాహుల్ పిటిషన్ ను మే 3న విచారణ చేపట్టనున్న సూరత్ కోర్టు.
- సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లిలో అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు
- విద్యార్థులను పాఠశాల నుండి ఇంటికి తీసుకెళుతుండగా ఘటన, ప్రమాద సమయంలో బస్సులో ఉన్న సుమారు 40 మంది విద్యార్థులు
- చెట్టు పక్కనే ఉన్న వ్యవసాయ బావి, చెట్టును ఢీకొని బస్సు ఆగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం
- సురక్షితంగా బయటపడ్డ విద్యార్థులు
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో ప్రభుత్వం మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది.. సోమవారం ఉదయం సింగమాల గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. దుకాణంలో మంటలను గమనించిన స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి దుకాణంలో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.. కానీ దుకాణంలో మంటలు అధికం అవుతున్న క్రమంలో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దాదాపు డెబ్భై లక్షల రూపాయల వరకూ ఆస్తి నష్టం వాటిల్లినట్లు మద్యం దుకాణం నిర్వహకులు అంచనాకు వచ్చారు. విషయం తెలుసుకున్న తొట్టంబేడు పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబు, లోకేష్ కు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఛాలెంజ్?
తనపై చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపిస్తే MLA పదవికి రాజీనామా చేస్తాను
నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుండి తప్పుకుంటారా?
యువగళం పాదయాత్రలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరంలో చెరువును ఆక్రమించుకుని ఫామ్ హౌస్ నిర్మించారని తీవ్ర ఆరోపణలు చేసిన నారా లోకేష్
లోకేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఉండవల్లిలోని కరకట్ట వద్ద గల చంద్రబాబు నివాస సమీపంలోకి చేరుకున్న కేతిరెడ్డి
ఫేస్ బుక్ లైవ్ లో చంద్రబాబు నివాసాన్ని చూపిస్తూ ఇది అక్రమ కట్టడం కాదా అంటూ ప్రశ్న
నేను రైతుల వద్ద భూములు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నా, చంద్రబాబులా రైతులను బెదిరించి నది వెంబడి భూములు లాక్కుని ఫామ్ హౌస్ లు నిర్మించలేదు’’ అని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడారు.
తండ్రి మరణించాడన్న బాధను గుండెల నిండా పెట్టుకొని, మనో ధైర్యంతో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు ఓ విద్యార్థి. నిర్మల్ జిల్లా కడెం మండలం మర్రిగూడేనికి చెందిన ఓ విద్యార్థి తండ్రి ఆదివారం చనిపోయాడు. తక్కళ్ల రోహిత్ అనే విద్యార్థి తండ్రి వెంకటి అనారోగ్యంతో ఒక వారం రోజుల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. అయితే ఈ రోజు వెంకటి అంత్యక్రియలు జరపాల్సి ఉండగా అదంతా పక్కన పెట్టి గుండె నిండా బాధను ఉంచుకొని మనో ధైర్యంతో పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. విద్యార్థి క్రమశిక్షణ పరీక్ష రాయాలనే పట్టుదలను చూసి పలువురు రోహిత్ ని అభినందించారు. ఇలాంటి వారిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని స్థానికులు అంటున్నారు.
జార్ఖండ్‌లోని ఛత్రాలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నక్సలైట్లలో ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. కాగా హత్యకు గురైన ఇద్దరు నక్సలైట్లపై ఐదు లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. అదే సమయంలో వారి వద్ద నుంచి రెండు ఏకే 47ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.
పెదకూరపాడులో కొద్ది రోజులుగా జరుగుతున్న ఇసుక గొడవల నేపథ్యంలో ఓ ఇసుక రీచ్ కు వెళ్తున్న సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. వైకుంఠ పురం సమీపంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజెవైఎం కార్యకర్తలకు మద్య వాగ్వాదం జరిగింది. పల్నాడులోకి అడుగు పెట్టనివ్వకూడదని పోలీసులకు రహస్య ఆదేశాలు అందాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమను అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఉద్యమం చేపడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు హెచ్చరించారు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ వ్యవహారాలు జరిగాయంటూ సంస్థ యాజమాన్యానికి ఏపీ సీఐడీ కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్‌ను ఏపీ సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని వారి నివాసంలో రామోజీరావు, శైలజా కిరణ్‌ను ఏపీ సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చిట్‌ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించారనే ఆరోపణలపై ఏ - 1గా రామోజీరావు, ఏ - 2గా శైలజా కిరణ్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచీల మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవీ. రమణ వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన అందాల తార జాన్వీ కపూర్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నేటి నుండి ప్రారంభమైయ్యాయి. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారిలో 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా.. ఒకసారి తప్పినవారు 8,632 మంది, ఓరియంటల్ విద్యార్థులు మరో 162 మంది ఉన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 11 పేపర్లకు బదులు 6 పేపర్లే ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు ఒకరోజే పరీక్ష జరుగుతుంది. విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తారు. కనీసం అర గంట ముందుగా చేరుకోవాలని అధికారులు సూచించారు.మొదటిరోజు మాత్రం 5 నిమిషాల పాటు ఆలస్యంగా వచ్చినా.. అంటే 9.35 గంటల వరకు అనుమతిస్తారు.
Background
తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు:
మొన్న తూర్పు మధ్యప్రదేశ్ నుండి తెలంగాణ వరకు ఉన్న ద్రోణి /గాలి విచ్చిన్నతి, ఈరోజు బలహీన పడింది. కాబట్టి, రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 5 వరకూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేశారు.
Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. రాగల 5 రోజులు ఎల్లో అలర్ట్ ఉంటుందని వాతావరణ అధికారులు వెదర్ బులెటిన్‌లో తెలిపారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 78 శాతం నమోదైంది.
ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో చాలా కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.
‘‘నేడు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా భాగం మీదుగా గాలుల సంగమం కొనసాగుతోంది. దీని వలన గాలిలో ఏర్పడే వొత్తిడి వర్షాలకు కారణమౌతుంది. ఎప్పుడైతే వేడి ఉంటుందో, వర్షాలు వెంటనే ఏర్పడతాయి. ఇంతవరకు మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా విజయవాడలో మాత్రం వర్షాలు పడలేదు. కానీ ఇప్పుడు కొండపల్లి ప్రాంతం వైపుగా ఏర్పడుతున్న భారీ వర్షాలు నగరంలోనికి విస్తరిస్తున్నాయి. దీని వలన మరో గంట వ్యవధిలో నగరం వ్యాప్తంగా భారీ వర్షాలను, పిడుగులను చూడగలము. జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోగలరు.
నర్సీపట్నం - తుని వైపు భారీ పిడుగులు, వర్షాలు విస్తరిస్తోంది. ఇవి నేరుగా తుని టౌన్ వైపు విస్తరిస్తున్నాయి. దీని వలన ఆ ప్రాంతంలో మరో గంట సేపట్లో భారీ వర్షాలను చూడగలము. మరో వైపున యస్.కోట వైపుగా మొదలైన భారీ వర్షాలు నేరుగా విశాఖ నగరం సివారు ప్రాంతాలైన పెందుర్తి - గోపాలపట్నం వైపుగా విస్తరించనుంది. పిడుగులు మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఎన్.టీ.ఆర్. జిల్లాలోని గన్నవరం - బెజవాడ ఉత్తర భాగాల మీదుగా ఏర్పడుతున్న వర్షాలు నేరుగా కృష్ణా జిల్లా కైకలూరు మీదుగా విస్తరించనుంది. తిరుపతి జిల్లాలోని పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి.
ప్రస్తుతం కాకినాడ వైపుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా భాగాల్లో వర్షాలు విస్తరిస్తున్నాయి. నేడు కాకినాడలో ప్రస్తుతం కొనసాగుతున్న భారీ వర్షాలు మరో 20-30 నిమిషాల్లో బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి. అలాగే ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ విశ్లేషించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -