Breaking News Live Telugu Updates: సికింద్రాబాద్ లో మరో అగ్నిప్రమాదం, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో మంటలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. భవనం పైన మంటలు ఎగసిపడ్డాయి. సికింద్రాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ తులిఫ్ పైన స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఎగసిపడిన మంటలను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కరంట్ వైర్ తెగి రేకుల షెడ్ పై పడిపోవడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే మంటలు అదుపులోకి వచ్చాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఇటీవల చేసిన అవమానకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ వివరణ కోరింది. ఫిబ్రవరి 21 తేదీ ఉదయం 11:30 గంటలకు జరగనున్న విచారణకు కౌశిక్ రెడ్డి స్వయంగా హాజరు కావాలని అధికార పార్టీ ఎమ్మెల్సీకి పంపిన నోటీసులో జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ఫిబ్రవరి 14 తేదీన జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి సిఎం కేసిఆర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కాసేపటి క్రితం చనిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కాసేపటి క్రితం చనిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తారకరత్న నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. పక్కనే ఉన్న వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును పలకరించారు. కాసేపు వారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. విజయసాయి రెడ్డి తరచూ చంద్రబాబు లక్ష్యంగా పరుష పదజాలంతో ట్విటర్ వేదికగా ట్వీట్లు చేసే సంగతి సంగతి తెలిసిందే.
శంకర్ పల్లి సమీపంలోని తారకరత్న ఇంటికి వెళ్లి చంద్రబాబు ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. తర్వాత తారకరత్న చిత్ర పటానికి పూలు సమర్పించి, నమస్కరించారు. తారకరత్న భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను చంద్రబాబు, భువనేశ్వరి పరామర్శించారు.
నటుడు తారకరత్న మృతి తనను ఎంతో బాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ‘‘సినిమాలు, ఎంటర్‌టైన్‌రంగంలో తారకరత్న తనదైన ముద్రవేశారు. ఆయన మృతి నన్ను ఎంతో బాధించింది. తారకరత్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. ఓంశాంతి’’ అని ట్వీట్ చేశారు.
మోకిలలోని సొంతింట్లో ఉన్న తారకరత్న భౌతికకాయం వద్దకు వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెళ్లి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యంతో తారకరత్న తిరిగివస్తాడని అనుకున్నామని, విధి మరోలా తలచిందని వాపోయారు. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని అన్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కొత్తూరు మండలానికి చెందిన కొందరు రెవెన్యూ అధికారులు అనేక విధాలుగా డబ్బులు గుంజుతున్నారంటూ మావోయిస్టుల పేరిట ఓ లేఖ శనివారం చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. కేవలం రాతపూర్వకంగా రైతాంగ పోరాట కమిటి, కొండబారెడు దళం డివిజన్ కార్యదర్శి భాస్కర్ పేరిట ఈ లేఖ విడుదలైంది. ఆ లేఖలో కొత్తూరు తహ శీల్దార్ బాల కొత్తూరు, సర్వేయర్ జగదీష్, మెట్టూరు సర్వేయర్ లక్ష్మణరావు రైతు మిత్రులను అనేక విధా లుగా ఇబ్బందులు పెట్టి సర్వేలో మోసాలకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నారనిఉంది. వీరికి కొత్తూరు సచివాలయ వీఆర్వో రాము అన్ని విధాలుగా సహకరిస్తున్నాడని, స్థానికంగా ఉన్న మరో మధ్యవర్తిని నియమించుకుని వసూ ళ్లకు పాల్పడు తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. కొత్తూరు తహశీల్దార్, సర్వేయర్ జగదీష్ తీరు నెల రోజుల్లో మారకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిం చారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
బెంగళూరులో నిన్న (ఫిబ్రవరి 18) కన్నుమూసిన నటుడు తారకరత్న భౌతిక కాయం హైదరాబాద్ చేరింది. రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన సొంత ఇంటికి ఆయన భౌతిక కాయాన్ని చేర్చారు. ఆయన్ను ఆఖరిసారి చూసేందుకు సీని ప్రముఖులు, కుటుంబ సభ్యులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
Background
ఉత్తర భారతం నుంచి వస్తున్న పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు.
తెలంగాణలో క్రమంగా చలి తగ్గుతోంది. నేడు మూడు జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ జారీ అయింది. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేడు ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 17.1 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
ఇక క్రమంగా ఎండాకాలం
‘‘తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎండలు బాగా పెరగనున్నాయి. మరో మూడు రోజుల వ్యవధిలో ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం, భద్రాద్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేడి 38 డిగ్రీల వరకు ఉండనుంది. ఇందులో విజయవాడ, ఏలూరు, రాజమండ్రి ఉండటం వలన నగర వాసులు తగినంత నీటిని తాగుతూ జాగ్రత్త పడగలరు. మరోవైపున రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కొనసీమ, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేడితో పాటు ఉక్కపోత కూడ ఉండనుంది. కానీ రాత్రి, అర్ధరాత్రి, వేకువజామున మాత్రం చల్లగా ఉండనుంది. తెలంగాణ వ్యాప్తంగా చల్లగా, ముఖ్యంగా హైదరాబాదులో 11 నుంచి 15 డిగ్రీల మధ్యన రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -