హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) అని చెబితే... 'ఆయన ఎవరు?' అని ఈతరం ప్రేక్షకులు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే... ఆయన ఇండస్ట్రీకి దూరమై చాలా రోజులు అయ్యింది. అయితే... ఒకప్పుడు ఆయన సూపర్ హిట్ సినిమాలు చేశారు. మరి, అటువంటి వడ్డే నవీన్ ఎప్పుడు ఎలా ఉన్నారో చూశారా?

కొత్తపల్లి గీత కుమారుడి పెళ్లిలో 'పెళ్లి' హీరో!'జాబిలమ్మ నీకు అంత కోపమా...' పాట గుర్తు ఉందా? ఒకవేళ వడ్డే నవీన్ గుర్తు లేకపోయినా సరే 'పెళ్లి' సినిమాలో ఆ పాటను ఈతరం ప్రేక్షకులు సైతం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. అందులో హీరో వడ్డే నవీన్. 

'పెళ్లి'తో పాటు 'మానసిచ్చి చూడు', 'నా హృదయంలో నిదురించే చెలి', 'ప్రేమించే మనసు', 'చాలా బాగుంది', 'మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది' వంటి హిట్ సినిమాల్లో నటించిన వడ్డే నవీన్... ఇటీవల పరుచూరి రామ కోటేశ్వర రావు, కొత్త పల్లి గీత దంపతుల కుమారుడు అభినయ్ తేజ్ వివాహానికి హాజరు అయ్యారు (Vadde Naveen New Look). 

వడ్డే నవీన్ చాలా రోజుల తర్వాత ఓ వేడుకలో కనిపించడంతో ఆయన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. వడ్డే నవీన్ సినిమాలు చూసిన ప్రేక్షకులు, ఆ ఫోటోలు చూసి ఆశ్చర్యపోతుంటే... ఈతరం ప్రేక్షకులు ఆయన సినిమాల గురించి తెలుసుకుంటున్నారు. అదీ సంగతి!

Also Read: జీసస్‌తో పాటు గణేశుడికీ పూజలు... సమంత ఇంట్లో హిందూ దేవుళ్లు

పరుచూరి రామ కోటేశ్వర రావు, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతుల కుమారుడు పరుచూరి అభినయ్ తేజ్, అక్షత వివాహానికి సినిమా ఇండస్ట్రీ నుంచి విజయేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, తరుణ్, శివ బాలాజీ, నవీన్ చంద్ర తదితరులతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు రాజకీయ నేతలు హాజరు అయ్యారు.

Also Read'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?