Breaking News Live Telugu Updates: పాతబస్తీలో  తృటిలో తప్పిన పెను ప్రమాదం, 12 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 18 Sep 2022 10:43 PM
పాతబస్తీలో  తృటిలో తప్పిన పెను ప్రమాదం, 12 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది 

హైదరాబాద్ పాతబస్తీలో పెను ప్రమాదం తప్పింది.  చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలీ ఖబర్ రోడ్‌లో ఓ పురాతన భవనం మొదటి అంతస్తు పై కప్పు ఉన్నట్టుండి కూలిపోయింది.  సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  మొఘల్‌పురా అగ్నిమాపక బృందం అక్కడికి చేరుకుని 12 మందిని రక్షించారు. 
 

సిద్ధిపేట జిల్లా ఘో ర ప్రమాదం, బావిలోకి దూసుకెళ్లిన కారు 

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. కొండపాక మండలం జప్తి నాచారం గ్రామ శివార్లలో కారు అదుపుతప్పి బావిలో పడింది. కారులో ముగ్గురు ప్రయాణిస్తూ ఉండగా ఒకరు మృతి చెందారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డట్లు స్థానికులు తెలిపారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన దేవాయర సాగరం కనకయ్య,  వెంకట్ స్వామిని స్థానికి ఆసుపత్రికి తరలించారు. కెమ్మ సారం యాదగిరి( 42), ఓడిఎఫ్ ఉద్యోగి మృతి తి చెందారు.  సంఘటన స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. బావి నిండా వాటర్ ఉండడంతో కారును వెలికి తీసే ప్రయత్నం ఆలస్యం అవుతుందని పోలీసులు తెలిపారు.  

భువనేశ్వర్ - తిరుపతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ముప్పు

Nellore : నెల్లూరు నగరానికి సమీపంలోని వేదాయపాలెం రైల్వే స్టేషన్ దగ్గర భువనేశ్వర్ నుంచి తిరుపతి వెళ్తోన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఒక్కసారిగా ఆగింది. ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. స్టాపింగ్ లేకుండా ఇక్కడ ట్రైన్ ఎందుకు ఆగిందా అని ఆలోచించారు. ఈలోగా S3 బోగీ నుంచి దట్టమైన పొగలు అలముకున్నాయి. మంటలతో పొగలు వ్యాపించినట్టు గమనించిన ప్రయాణికులు రైలు దిగి పరుగందుకున్నారు. రైలు సిబ్బంది వచ్చి పరిస్థితిని అంచనా వేశారు. ఏసీ కంపార్ట్ మెంట్ వద్ద షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పొగలు వచ్చినట్టు అనుమానించారు. కాసేపటికి పొగలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. దీంతో రైలు ముందుకు కదిలింది. 

సురారంలోని జమీయా తలిముల్ ఇస్లాం మదర్సాలో ఎన్ఐఏ సోదాలు

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సురారంలోని  సాయిబాబా నగర్ జమీయా తలిముల్ ఇస్లాం మదర్సాలో NIA సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో 10 మంది అధికారులు పాల్గొన్నారు. అక్కడున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ స్వాధీనపరచుకున్నారు.  మదర్సా ఉపాధ్యాయుడు PFI సభ్యుడిగా గుర్తించారు. 

Telangana Governor: గవర్నర్ ను కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి

గవర్నర్ తమిళిసైను గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ సతీమణి ఉషాభాయి ఆదివారం కలిశారు. తన భర్తపై పీడీ యాక్ట్‌ను రద్దు చేయాలని కోరారు. తన భర్తపై అక్రమంగా కేసులు పెట్టారని గవర్నర్‌కు ఆ లేఖ అందజేశారు. ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉషాభాయి లేఖలో పేర్కొన్నారు.

Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం పట్టివేత

  • శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం పట్టివేత

  • దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన మహిళా ప్రయాణికురాలి దగ్గర బంగారం సీజ్

  • మహిళా ప్రయాణికురాలి వద్ద 268.400 గ్రాముల బంగారం సీజ్

  • పట్టుకున్న బంగారం విలువ 13 లక్షల 73 వేలు ఉంటుందన్న కస్టమ్స్ అధికారులు

  • మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు

Thirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదోర, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు చంద్రశేఖర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శ ఏర్పాట్లు చేసారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల విజయనగరం ఎంపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సీఎం జగన్ కు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించానన్నారు. సీఎం జగన్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు.. అభువృద్దికి వెంకన్న తోడు నీడగా ఉండాలని వేడుకున్నానని, బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగాలని మనస్పూర్తిగా ప్రార్ధించానన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానని, రాష్ట్రానికి మంచి చేస్తున్న సీఎం జగన్ కు ఆయుర్ ఆరోగ్యాలు, దైర్యం, స్థైర్యం ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి అన్నివిధాలా అండగా ఉండేలా పీఎం మోడీ మనసును స్వామి వారు మార్చాలని ప్రార్ధించానని తెలిపిన ఆయన, ఆర్థికంగా రాష్ట్రానికి కాపాడేలా చేయాలనీ వేడుకున్న చెప్పారు.ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్లు సంక్షేమ పధకాలు అమలు చేసారని, 80 శాతం మంది ప్రజలు నవరత్నాలు అందుకొని ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు.

NIA Raids: కరీంనగర్ లో ఒకరు ఎన్ఐఏ అదుపులోకి

తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ పట్టణ కేంద్రంలోని హుస్సేనీ పురాకు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ అనే ఓ వ్యక్తిని NIA బృందం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

NIA Searches: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ NIA సోదాలు, వారి ఇళ్లే లక్ష్యంగా

తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మిక దాడులతో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఉగ్ర మూలాలను వెతికే పనిలో పడింది. ఇందులో భాగంగానే జగిత్యాలకు చెందిన పలువురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతల ఇండ్లు, వ్యాపార స్థలాల్లో సోదాలు చేస్తోంది. జిల్లాకు చెందిన పలువురు యువకులు సైతం సామాజిక సేవ పేరుతో జరిగిన ఆయుధ శిక్షణలో పాల్గొన్నట్లుగా గతంలోని ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

Background

తెలుగు రాష్ట్రాల్లో రాగల రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని  హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. రేపు (సెప్టెంబరు 19) బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుందని వెల్లడించారు. అదే జరిగితే 19, 20 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని, ఏపీలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు అంచనా వేశాయి.


అమరావతి వాతావరణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వాయువ్య మరియు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. 19 నాటికి అది అల్ప పీడనంగా మారుతుంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాగల మూడు రోజులు వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.


ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అయితే, ఈ వర్షాల తీవ్రత నేడు తెలిసే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రంలోని సీనియర్ అధికారి డాక్టర్ కరుణసాగర్ తెలిపారు.


స్కైమెట్ అనే వాతావరణ వెబ్ సైట్ రిపోర్టు ప్రకారం, దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువ వాన కురిసే అవకాశం లేదు. ఇంటీరియర్ కర్ణాటక, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, కేరళలో రానున్న రోజుల్లో అతి తక్కువగా వర్షాలు కురుస్తాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కొంత పెరుగుతాయి. రాబోయే కొద్ది రోజుల్లో దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని నివేదిక పేర్కొంది.


తెలంగాణలో వర్షాలు ఇలా (Telangana Weather)
నేడు (సెప్టెంబరు 18) తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు. సెప్టెంబరు 19న కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


20న భారీ వర్షాలు
భారీ వర్షాలు తెలంగాణలోని మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా్ల్లో అక్కడ కురిసే అవకాశం ఉంది.


Gold-Silver Price 18 September 2022: దేశంలో బంగారం ధర (Today's Gold Rate) నిన్నటితో (శనివారం) పోలిస్తే నేడు (ఆదివారం) కొద్దిగా పెరిగింది. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 150, స్వచ్ఛమైన పసిడి ₹ 170 పెరిగింది. కిలో వెండి ధర ₹ 300 పెరిగింది. 


ఈ తేదీన పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. ఈ వర్షాలు 21న కూడా కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.