KTR Faces ACB Questions Regarding Formula E Car Race Case: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో దాదాపు ఏడు గంటల పాటు మాజీ మంత్రి , బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగించుకొని బయటకు వచ్చిన కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అధికారులు అడిగారని అన్నారు.


అవినీతి లేని కేసులో అధికారులు నాలుగు ప్రశ్నల్నే తిప్పి తిప్పి అడుగుతున్నారని అన్నారు కేటీఆర్. అవి కూడా రేవంత్ అడిగే ప్రశ్నల్ను నలభై రకాలుగా అడుగుతున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పారు. తనకు అవగాహన ఉన్నంత వరకు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాని పేర్కొన్నారు. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని తనకు తెలిసిందే చెబుతానని అన్నారు. 



ఏసీబీ ఆఫీస్‌ ఎదుట మీడియాతో మాట్లాడుతున్న టైంలో హైడ్రామా నడిచింది. ఇలా ఏసీబీ ఆఫీస్‌ ముందు మాట్లాడేందుకు మీడియా పాయింట్ లేదని ట్రాఫిక్ జామ్ అవుతుందని అధికారులు కేటీఆర్‌కు వివరించారు. మీడియా ప్రతినిధులను పంపించేందుకు ప్రయత్నించారు. ఇంతలో కేటీఆర్ కలుగుజేసుకొని ఇక్కడ మాట్లాడితే మీకు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. మీ పార్టీ ఆఫీస్‌కు వెళ్లి మాట్లాడుకోవాలని అధికారులు సూచించారు. రోడ్డుపై మాట్లాడితే ట్రాఫిక్‌కు ఇబ్బంది తలెత్తుతుందని అన్నారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని చెప్పడంతో కేటీఆర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 



రేస్‌ కేసులో తొలిసారిగా కేటీఆర్‌ను విచారించిన ఏసీబీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి తర్వాత ఆయన్ని రెండోసారి పిలిచి ప్రశ్నించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి రోజు విచారణలో దాదాపు ఏడు గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. 


అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ నేతలు భుజాలపై మోసుకొని కార్యాలయంలోకి తీసుకెళ్లారు. తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌... ఉదయం నుంచి సంఘీభావంగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. " గత 10 సంవత్సరాలుగా అత్యంత నిబద్ధతతో, అవినీతిరహితంగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించనట్లు ఏసీబీకి చెప్పినాను. ప్రశ్నలు అడిగే విషయంలో వారు కూడా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే కేసులో ఎలాంటి అవినీతి లేదు. ప్రపంచ దేశాలతో పోటీపడి తెచ్చిన ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ నగరంలోని ఉండాలన్న ఉద్దేశంతో రేసును కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాను. కేవ





లం హైదరాబాద్ నగర ప్రతిష్ట కోసం, తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు తయారీకి కేంద్రంగా మార్చాలన్న ఉద్దేశంతో నిర్ణయం చేసినట్లు చెప్పాను. 


అడిగిన ప్రశ్నలనే పదేపదే ఏసీబీ అడిగిందన్నారు కేటీఆర్. ఇక్కడి నుంచి పోయిన కాసులు ఫార్ములా ఈ సంస్థ వద్ద ఉన్నాయని చెప్పానన్నారు. మరి అలాంటప్పుడు కేసు ఎక్కడ ఉందని ప్రశ్నించినట్టు తెలిపారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వెళతానన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రశ్నలు పట్టుకొని మళ్లీ పిలిస్తే మళ్లీ వెళ్తాను అని స్పష్టం చేశారు. 







అవినీతి లేని కేసులో అవినీతి గురించి అడిగే ప్రశ్న ఎక్కడిదన్నారు కేటీఆర్‌ "ఆ ఫైల్ ఎక్కడ పోయింది... ఈ ఫైల్ ఎక్కడ పోయింది అని అడిగారు. నేను మంత్రిగా నిర్ణయం తీసుకున్నా అని స్పష్టం చేశాను. న్యాయస్థానాలు, కోర్టులపైన నమ్మకం ఉంది... తప్పకుండా సహకరిస్తాం. ఇది ముమ్మాటికి లొట్ట పీసు కేసునే ఆయన లొట్ట పీసు ముఖ్యమంత్రినే. ప్రపంచ పటంలో హైదరాబాద్ను పెట్టాలన్న కమిట్మెంట్ మాది... మా కేసీఆర్ గారిది. 50 లక్షల రూపాయలతో నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగలం మేము కాదు మేము... మాకు భయం లేదు. సంవత్సరం తర్వాత కూడా నిన్ను ప్రజలు గుర్తు పెట్టకపోతే మేమేమి చేయాలి.  






" కనకపు సింహాసనమున శునకమును కూర్చున్న పెట్టినట్టు తెలంగాణలో పరిస్థితి ఉన్నది. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ఎన్ని నిర్బంధాలు చేసిన ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి కెసిఆర్ సైనికుడిగా మాట్లాడుతాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి...  అన్ని వర్గాలకు చేసిన ఎన్నికల హామీల ప్రారంభం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపైన నిరంతరంగా మాట్లాడుతూనే ఉంటాం." అని అన్నారు.