Pawan Kalyan Comments On Tirumala Stampede: టీటీడీ ఛైర్మన్ గారూ మేల్కొండి- వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టండి: పవన్
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతప్పు జరిగింది.. బాధ్యత తీసుకుంటాము అన్నారు పవన్ కల్యాణ్.
మృతుల కుటుంబీకులు, క్షతగాత్రులు, రాష్ట్ర ప్రజలు, వేంకటేశ్వర స్వామి భక్తులు, హైందవ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరినీ క్షమించమని ప్రభుత్వం కోరుతోంది అన్నారు పవన్.
గురువారం సాయంత్రం పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకొని తొక్కిసలాట చోటు చేసుకున్న బైరాగిపట్టెడ ప్రాంతంలోని పద్మావతి పార్క్, రామానాయుడు పబ్లిక్ స్కూల్ పరిసరాలను పరిశీలించారు.
స్విమ్స్‌కు చేరుకొని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
వైద్య సిబ్బందితో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
చికిత్స పొందుతున్నవారినీ, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషినల్ ఈవో వెంకయ్య చౌదరి బాధ్యత తీసుకోవాలన్నారు పవన్
తమ బాధ్యతల నిర్వహణలో విఫలం అయ్యాని ఆరోపించారు. వారి మధ్య, పాలక మండలి మధ్య గ్యాప్స్ ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో పోలీసులు బాధ్యత తీసుకోవాలి. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా జరగలేదని భక్తులు చెబుతున్నారని తెలిపారు.
టీటీడీ సిబ్బంది, పోలీసులు ఉండి కూడా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు పవన్
ఇంతమంది పోలీసు అధికారులున్నా తప్పు ఎందుకు జగిరింది? పోలీసు శాఖ నిర్లక్ష్యంపై సి.ఎం. దృష్టికీ, డీజీపీ దృష్టికీ తీసుకువెళ్తానని పవన్ వివరించారు .
తొక్కిసలాట జరిగితే సహాయక చర్యలు ఎలా ఉండాలనే ప్రణాళిక కూడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు అని అన్నారు.
అధికారులు చేసిన తప్పులకు మేము తిట్లు తింటున్నాము. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయి. ప్రక్షాళన మొదలు కావాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు.