Breaking News Live Telugu Updates:కోమటిరెడ్డి పాదయాత్రలో ఉద్రిక్తత, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 16 Feb 2023 05:30 PM
కోమటిరెడ్డి పాదయాత్రలో ఉద్రిక్తత, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ 

నల్గొండ ఇటుకులపాడులో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీ కోమటిరెడ్డిపైకి బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులు విసిరారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.  

Lokesh Yuvagalam: సత్యవేడు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం యాత్ర

తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, నారాయణ వనం మండలంలోని అరణ్యంకండ్రిగ గ్రామంలోని దాసరి కమ్యూనిటీ మహిళలు గ్రామ గ్రామాన గాజులు అమ్ముకొని జీవనం సాగిస్తున్న మహిళలను నారా లోకేష్ కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందంటూ లోన్ల రూపంలో ఆర్థిక సహాయం చేస్తే వ్యాపారులు చేసుకోగలుగుతామని గతంలో దాసరి కమ్యూనిటీ ద్వారా తమకు చిరు వ్యాపారాల లోన్లు వచ్చేవని అన్నారు. ప్రస్తుతం అవి రావటం లేదని మహిళలు నారో లోకేష్ దృష్టికి తీసుకొని వెళ్ళారు. ఈ సందర్భంగా వారిని ఆదుకుంటామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. దాసరి కమ్యూనిటీని అన్ని విధాలా ఆదుకుంటాం, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంచార జీవనం వీడి సొంతంగా అభివృద్ధి అవ్వడం కోసం ఆర్ధిక భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

GVL Narasimha Rao: కన్నా రాజీనామాపై స్పందించిన జీవీఎల్

కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా అంశంపై ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగా.. దీనిపై తాను మాట్లాడబోనని చెప్పారు. స్పందన అధిష్ఠానం నుంచే వస్తుందని అన్నారు. ఎంత బలవంతం చేసినా తాను కన్నా రాజీనామా అంశంపై మాట్లాడలేనని అన్నారు. తనకు పూర్తి వివరాలు తెలియవని, మీడియా ద్వారానే కన్నా రాజీనామా అంశం తెలిసిందని అన్నారు.

Kanna Lakshmi Narayana Resign: బీజేపీ పెద్దలకి కన్నా లక్ష్మీ నారాయణ మరికాసేపట్లో రాజీనామా లేఖ

  • మరికాసేపట్లో బీజేపీకి రాజీనామా చేయనున్న కన్నా లక్ష్మీనారాయణ

  • కన్నాతో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్న ఆయన అనుచరులు 

  • ముఖ్య అనుచరులతో సమావేశమైన కన్నా లక్ష్మీనారాయణ 

  • సమావేశం తర్వాత మూకుమ్మడిగా బీజేపీకి రాజీనామా 

  • రాజీనామాకు గల కారణాలు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మీడియాకు వివరించనున్న కన్నా, ఆయన అనుచరులు

Kanna Lakshmi Narayana: బీజేపీకి కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆ పార్టీని వీడారు. తన అనుచరులతో జరుగుతున్న సమావేశంలో ఈ విషయాన్ని ఆయన పంచుకున్నారు. ఆయనతో పాటు కన్నా అనుచరులు కూడా రాజీనామాలు సమర్పించారు. తన రాజీనామా అంశాన్ని మరికాసేపట్లో కన్నా లక్ష్మీ నారాయణ స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించే అవకాశం ఉంది.  

Kondapochamma Sagar: కొండపోచమ్మ సాగర్ కు చేరుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్

  • కొండపోచమ్మ సాగర్ కు చేరుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్

  • స్వాగతం పలికిన ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ 

  • కాళేశ్వరం ప్రాజెక్టు, రాష్ట్రంలోని గ్రౌండ్ వాటర్ పై అధ్యయనం చేయనున్న భగవంత్ మాన్ సింగ్

  • రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పై పంజాబ్ సీఎం కు వివరించనున్న స్పెషల్ సీఎస్ రజత్ కుమార్

Chandrababu in Kakinada: చంద్రబాబు కాకినాడ పర్యటన షెడ్యూల్

కాకినాడ జిల్లాలో రెండో రోజు జిల్లాలో పర్యటించిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు..


పెద్దాపురంలో ఇదేం కర్మ కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు నాయుడు


ఉదయం 9.30 గంటలకు జగ్గంపేట జ్యోతుల నెహ్రూ క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభం కానున్న చంద్రబాబు రోడ్ షో.


9.45 జగ్గంపేట HP పెట్రోల్ బంకు ప్రక్కన గల గ్రౌండ్ కు చేరుకోనున్న చంద్రబాబు నాయుడు 


10 గంటలకు జగ్గంపేట టీడీపీ నియోజకవర్గ నాయుకులు , కార్యకర్తలతో సమావేశం..


1 గంటకు భోజన విరామం 


2 గంటలకు సభాప్రాగణం నుండి  బయలుదేరనున్న చంద్రబాబు


2.30 గంటలకు పెద్దాపురం మండలం  J.తిమ్మపురంలో స్వాగతం పలకనున్న టీడీపీ నేతలు..


3.00 గంటలకు బైకు ర్యాలీ తో బయలుదేరనున్న చంద్రబాబు


3.30 కు కట్టమూరు సెంటర్ చేరుకుంటారు


4.00 గంటలకు విరామ సమయం


4.30 గంటల నుండి పెద్దాపురం  దర్గా సెంటర్ కు చేరుకోనున్న చంద్రబాబు


5.30 గంటలకు సామర్లకోట ఆంజనేయస్వామి విగ్రహ సమీపంలో సభా ప్రాంగణానికి చేరుకుని బహిరంగ మాట్లాడనున్న చంద్రబాబు


7.45 గంటలకు సుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హుస్ లో బస చేయనున్న చంద్రబాబు

Bhagwanthman Singh: నేడు మల్లన్న సాగర్‌కు రానున్న పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌తోపాటు తొగుటలోని మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నేడు పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ సందర్శించనున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి గురించి తెలుసుకున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌తోపాటు గజ్వేల్‌ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్‌డ్యామ్‌లను సందర్శించనున్నారు. పంజాబ్‌ సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం 10 గంటలకు ఆయన హైదరాబాద్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు బయలుదేరుతారు. రోడ్డు మార్గంలో 11 గంటలకు ప్రాజెక్టుకు చేరుకుంటారు. 11 నుంచి 11.30 వరకు కొండపోచమ్మ సాగర్‌ను, పంప్‌హౌస్‌ను సందర్శిస్తారు. అనంతరం 11.40 గంటలకు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్యనున్న చెక్‌డ్యామ్‌కు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు గజ్వేల్‌ పట్టణంలోని పాండవుల చెరువుకు చేరుకొని మినీట్యాంక్‌బండ్‌ అభివృద్ధిని పరిశీలిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.

Background

ఉత్తర భారతం నుంచి వస్తున్న పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 


నేడు తెలంగాణలో సగానికిపైగా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది.


కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 2 - 4 డిగ్రీలు: ఐఎండీ
తెలంగాణలో చలి నేడు రేపు 2 నుంచి 4 డిగ్రీల మధ్యలో కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో నేడు సగానికి పైగా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 16 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.


ఇక క్రమంగా ఎండాకాలం
‘‘తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎండలు బాగా పెరగనున్నాయి. మరో మూడు రోజుల వ్యవధిలో ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం, భద్రాద్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేడి 38 డిగ్రీల వరకు ఉండనుంది. ఇందులో విజయవాడ​, ఏలూరు, రాజమండ్రి ఉండటం వలన నగర వాసులు తగినంత నీటిని తాగుతూ జాగ్రత్త పడగలరు. మరోవైపున రాయలసీమ​, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల​, కొనసీమ​, విశాఖ, అనకాపల్లి, కాకినాడ​, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేడితో పాటు ఉక్కపోత కూడ ఉండనుంది. కానీ రాత్రి, అర్ధరాత్రి, వేకువజామున మాత్రం చల్లగా ఉండనుంది. తెలంగాణ వ్యాప్తంగా చల్లగా, ముఖ్యంగా హైదరాబాదులో 11 నుంచి 15 డిగ్రీల మధ్యన రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.